News March 14, 2025
మేడ్చల్: కొత్త మున్సిపాలిటీలలో విలీనం అయ్యే గ్రామాలు (2/2)

మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలో అలియాబాద్, మూడుచింతలపల్లి, ఎల్లంపేట పేర్లతో మూడు కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేయనుంది. ఎల్లంపేట మున్సిపాలిటీలో.. శ్రీరంగవరం, బండమాధరం, నూతనకల్, మైసిరెడ్డిపల్లి, కోనాయిపల్లి, సోమారం, రావల్‌కోల్, కండ్లకోయ, రాజ్‌బొల్లారం, ఘన్పూర్, గోసాయిగూడ గ్రామాలు విలీనం కానున్నాయి. ఈ నెల 17న అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టనున్నారు.
Similar News
News December 20, 2025
ముమ్మరంగా ‘మాక్ డ్రిల్’ ఏర్పాట్లు: సూర్యాపేట కలెక్టర్

ఆకస్మిక వరదలు, అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన కల్పించేందుకు ఈ నెల 22న కోదాడలోని షిరిడి సాయి నగర్‌లో ‘మాక్ డ్రిల్’ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. శనివారం ఎస్పీ నరసింహతో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. విపత్తుల సమయంలో ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రాణనష్టం జరగకుండా వేగంగా స్పందించేందుకు ఈ కసరత్తు దోహదపడుతుందన్నారు.
News December 20, 2025
ADB: PG విద్యార్థులకు ఆదివారం తరగతులు

డా.బీఆర్ అంబెడ్కర్ యూనివర్సిటీ పరిధిలో పీజీ మొదటి రెండవ సంవత్సరం విద్యార్థులకు కాంటాక్ట్ కం కౌన్సెలింగ్ తరగతులను నిర్వహిస్తున్నట్లు ఆదిలాబాద్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్, వర్సిటీ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ జగ్రామ్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో ఉన్న వర్సిటీ అధ్యయన కేంద్రంలో ఈ నెల 21న ఈ తరగతులు ఉంటాయని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా విద్యార్థులు తరగతులకు హాజరుకావాలని సూచించారు.
News December 20, 2025
తెలుగు బిగ్ బాస్: ఇద్దరు ఎలిమినేట్?

తెలుగు బిగ్ బాస్ సీజన్-9 తుది అంకానికి చేరింది. టాప్-5 కంటెస్టెంట్లలో నటి సంజన, కమెడియన్ ఇమ్మాన్యుయేల్ ఎలిమినేట్ అయ్యారని తెలుస్తోంది. టాప్-3లో కళ్యాణ్, తనూజ, డెమాన్ ఉన్నారని సమాచారం. వీరిలో ఇద్దరు ఫినాలేకు చేరనున్నారు. రేపు విన్నర్ ఎవరో తెలియనుంది. విజేతగా ఎవరు నిలుస్తారో కామెంట్ చేయండి.


