News November 4, 2025
మేడ్చల్: చేప పిల్లల విడుదలపై కలెక్టర్‌తో మంత్రి వీడియో కాన్ఫరెన్స్

పారదర్శకంగా నిర్వహిస్తున్న చేపపిల్లల విడుదల కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా హాజరయ్యేలా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. సోమవారం సచివాలయం నుంచి చేప పిల్లల పంపిణీ కార్యక్రమంపై మంత్రి కలెక్టర్లతో మత్స్య, పశుసంవర్థక శాఖ మంత్రివర్యులు వాకిటి శ్రీహరి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మేడ్చల్ కలెక్టరేట్ కార్యాలయం నుంచి అధికారులు పాల్గొన్నారు.
Similar News
News November 4, 2025
వయ్యారిభామను కట్టడి చేసే కలుపు మందులు

వయ్యారిభామ నిర్మూలనకు పంట మొలకెత్తక ముందు అట్రాజిన్ రసాయన మందును లీటర్ నీటికి నాలుగు గ్రాములు కలిపి పిచికారీ చేయాలి. పంట మొలకెత్తిన 15 నుంచి 20 రోజులకు.. లీటరు నీటికి 2 గ్రాముల 2,4-డి సోడియం సాల్ట్ కలిపి పిచికారీ చేయాలి. బంజరు భూముల్లో లీటరు నీటికి 5 గ్రాముల అట్రాజిన్ మందు కలిపి పిచికారీ చేసి వయ్యారిభామను నివారించవచ్చు. కలుపు నివారణ మందులను పిచికారీ చేసేటప్పుడు పక్క పంటలపై పడకుండా జాగ్రత్తపడాలి.
News November 4, 2025
ఇతిహాసాలు క్విజ్ – 56

1. కౌరవ, పాండవుల గురువైన ద్రోణాచార్యుడి గురువు ఎవరు?
2. మేఘనాదుడు ఎవరిని పూజించడం వల్ల ఇంద్రజిత్ అయ్యాడు?
3. నవ విధ భక్తి మార్గాలలో మొదటిది ఏమిటి?
4. ప్రతి మాసంలో వచ్చే పన్నెండో తిథి పేరు ఏమిటి?
5. సీత స్వయంవరం లో ఉన్న శివధనుస్సు అసలు పేరు ఏమిటి?
– సరైన సమాధానాలను సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం. <<-se>>#Ithihasaluquiz<<>> 
News November 4, 2025
ADB: ఉన్నత చదువులకు కస్తూర్బా బాట..!

కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు విద్యార్థులకు ఉన్నత విద్యకు మార్గం చూపుతున్నాయి. ఇంటర్‌తో పాటు ఎంసెట్, నీట్, జేఈఈ పోటీ పరీక్షలకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నేరడిగొండ, తలమడుగు, ఆసిఫాబాద్, కాగజ్ నగర్, మంచిర్యాల, బెల్లంపల్లి, దిలావర్పూర్, లక్ష్మణచాంద కేజీబీవీల్లో ఈ శిక్షణను ప్రస్తుతం అమలు చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం విద్యార్థుల సందేహాలు నివృత్తి చేస్తున్నారు.


