News January 3, 2026
మేడ్చల్ జిల్లాలో క్రీడా ప్రాంగణాల పరిస్థితి ఇది..!

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధి కీసర మండలం సహా అనేక ప్రాంతాల్లో తెలంగాణ క్రీడా ప్రాంగణాలు పిచ్చిగడ్డి, మొక్కలతో కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వం 259 క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. 145 క్రీడా ప్రాంగణాలను లే అవుట్ పార్కు స్థలాల్లో మొక్కుబడిగా ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ప్రభుత్వం నిర్వహణ మరిచింది. దీంతో ప్రస్తుతం అవి ఎటూ పనికిరాకుండా పోతున్నాయని ప్రజలంటున్నారు.
Similar News
News January 7, 2026
రాజకీయ ఉనికి కోసం గంటా పోరాటం(1/2)

భీమిలి MLA గంటా శ్రీనివాసరావు రాజకీయ ఉనికి కోసం పోరాడుతున్నారా? అనే చర్చ లోకల్‌గా నడుస్తోంది. గతంలో TDP ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన ఆయన జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పారు. అయితే 2019-24 YCP హయాంలో పార్టీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొనలేదు. కాగా 2024 ఎన్నికల్లో ఆయనను చీపురుపల్లికి పంపాలని అధిష్ఠానం భావించింది. చివరకు భీమిలి నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో గంటా గెలిచినా మంత్రి పదవి మాత్రం దక్కలేదు.
News January 7, 2026
KNR: ‘హలో.. మీ పేరుతో అప్పు తీసుకున్నారు’ (ఫేక్ కాల్స్)

హలో.. ‘మేము క్రెడిట్ కార్డు కంపెనీ నుంచి మాట్లాడుతున్నాం. మీ స్నేహితుడు లోన్ తీసుకొని గ్యారెంటీగా మీ పేరు ఇచ్చాడు. ఇప్పుడు ఆ మొత్తం మీరు కడతారా? అతడితో కట్టిస్తారా? అంటూ మోసగాళ్లు కాల్స్‌తో వేధిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో క్రెడిట్ కార్డు బకాయిల వసూళ్ల పేరిట ఫేక్ కాల్స్ చేస్తూ అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు.
News January 7, 2026
కోహ్లీ, సచిన్‌లకే సాధ్యం కాని రికార్డు.. పడిక్కల్ హిస్టరీ!

VHTలో కర్ణాటక ఓపెనర్ దేవదత్ <<18750203>>పడిక్కల్<<>> చరిత్ర సృష్టించారు. 3 వేర్వేరు సీజన్లలో 600పైగా రన్స్ చేసిన తొలి బ్యాటర్‌గా చరిత్రకెక్కారు. సచిన్, కోహ్లీ, రోహిత్ వంటి దిగ్గజాలకూ ఇది సాధ్యం కాలేదు. రాజస్థాన్‌పై 91 రన్స్ వద్ద అవుటై 6 మ్యాచ్‌ల్లో ఐదో సెంచరీ చేసే ఛాన్స్ త్రుటిలో చేజార్చుకున్నారు. లిస్ట్-A క్రికెట్‌లో 83.62 Avgతో పడిక్కల్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. VHTలో కర్ణాటక క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది.


