News February 17, 2025
మేడ్చల్ జిల్లాలో పడిపోతున్న భూగర్భ జలాలు

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా రోజురోజుకు భూగర్భజలాలు పడిపోతున్నాయని అధికారులు చెబుతున్నారు. అధికారుల లెక్కల ప్రకారం రెండు నెలల్లో 1.8 మీటర్లకు పైగా భూగర్భ జలం పడిపోయిందని పేర్కొన్నారు. రాబోయే వేసవికాలంలో మరింత అట్టడుగు స్థాయికి చేరే అవకాశం ఉన్నట్లుగా భూగర్భజల శాఖకు సంబంధించిన అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రతి నెల నెల పీజో మీటర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News March 3, 2026
ఇరాన్ ప్లాస్టిక్ డ్రోన్ల సంచలనం!

సౌదీలోని ‘అరామ్‌కో’ ఆయిల్ రిఫైనరీపై ఇరాన్ షాహెద్-136 <<19277309>>డ్రోన్లతో<<>> దాడి చేసింది. అమెరికా టెక్నాలజీతో డెవలప్ చేసిన ఈ డ్రోన్లు ప్లాస్టిక్, కార్బన్ ఫైబర్‌తో రూపొందాయి. ఇవి భూమికి 50 అడుగుల ఎత్తులోనే ప్రయాణిస్తాయి. లోహాన్ని మాత్రమే గుర్తించే US రాడార్లకు ఇవి చిక్కకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. ప్రస్తుతం ఈ ఆయుధం జియోపాలిటిక్స్‌లో అమెరికా ఆధిపత్యానికి సవాలు విసురుతోంది.
News March 3, 2026
వేములవాడ: ‘శివ కళ్యాణం ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేయాలి’

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర క్షేత్రంలో శివ కళ్యాణోత్సవాలకు విస్తృత ఏర్పాటు చేయాలని ఆలయ ఈవో రమాదేవి ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం ఆమె సమీక్ష నిర్వహించారు. ఐదు రోజులపాటు నిర్వహించనున్న ఉత్సవాలలో భాగంగా 6వ తేదీ స్వామివారి కళ్యాణం, 8వ తేదీ రథోత్సవం నిర్వహిస్తామని, కళ్యాణోత్సవానికి వేలాదిమంది తరలివచ్చే అవకాశం ఉన్నందున విస్తృత ఏర్పాట్లు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
News March 3, 2026
KNR: మంత్రి ఆదేశం.. క్రీడాకారులకు ఊతం!

క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం నూతన పాలసీని తీసుకురానుంది. ఈ మేరకు మంత్రి వాకిటి శ్రీహరి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఒలింపిక్, పారా ఒలిపింక్, అంతర్జాతీయ, జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ చాటిన క్రీడాకారులకు ఆర్థిక సాయం అందించేలా 2026-27 బడ్జెట్‌లో కేటాయింపులు చేయనున్నారు. తద్వారా వివిధ స్థాయిల్లో రాణిస్తోన్న మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా క్రీడాకారులకు తోడ్పాటు లభించనుంది.


