News January 26, 2025
మేడ్చల్ జిల్లాలో పెద్ద కార్పొరేషన్ బోడుప్పల్

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఉన్న 4 కార్పొరేషన్లలో అతిపెద్ద కార్పొరేషన్‌గా బోడుప్పల్ ఉంది. దాదాపుగా 1.5 లక్షల జనాభాతో, 162 కాలనీలతో బోడుప్పల్ కార్పొరేషన్ విస్తరించి ఉంది. అయితే ప్రతి ఏడాది సుమారు రూ.60 కోట్ల మేరకు ఆదాయం వస్తుందని, ఈ నేపథ్యంలో కార్పొరేషన్ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ సకల వసతులు కల్పించి, ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
Similar News
News September 17, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News September 17, 2025
ఖమ్మం: రేపటి నుంచి సదరం క్యాంపులు

ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఈ నెల 18 నుంచి సదరం క్యాంపులు నిర్వహించనున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ నరేందర్ తెలిపారు. దివ్యాంగులు ఈ క్యాంపుల కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవాలని సూచించారు. ఈ సదరం క్యాంపులు ఈ నెల 18, 23, 25, 30వ తేదీలలో జరుగుతాయి. అర్హులైన దివ్యాంగులు తమ మెడికల్ రిపోర్టులు, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, స్లాట్ బుకింగ్ స్లిప్‌తో ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి హాజరు కావాలని ఆయన కోరారు.
News September 17, 2025
ఆఫ్గనిస్థాన్‌పై బంగ్లాదేశ్ గెలుపు

ఆసియా కప్: ఆఫ్గనిస్థాన్‌పై బంగ్లాదేశ్ 8 రన్స్ తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా జట్టు 20 ఓవర్లలో 154/5 పరుగులు చేసింది. తన్జిద్ 52, సైఫ్ 30, తౌహిద్ 26 రాణించారు. రషీద్, నూర్ అహ్మద్‌లకు చెరో 2, అజ్మతుల్లా ఒక వికెట్ తీశారు. ఆఫ్గన్ జట్టు 146 రన్స్‌కు ఆలౌటైంది. గుర్బాజ్ 35, అజ్మతుల్లా 30, రషిద్ 20 మినహా ఎవరూ మంచిగా రాణించలేదు. ముస్తఫిజుర్ 3, నసుమ్, తస్కిన్, రిషద్‌లకు తలో వికెట్ దక్కింది.