News January 25, 2025
మేడ్చల్ జిల్లాలో వారికి ఏటా రూ.12 వేలు..!

మేడ్చల్ జిల్లాలో భూమిలేని వ్యవసాయ నిరుపేద కూలీలకు ఏటా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం పేరిట రూ.12 వేల ఆర్థిక సాయం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.ఈ నేపథ్యంలో డీఆర్డీఓ అధికారులు సర్వే చేసి 1074 మంది అర్హులైన లబ్ధిదారులను అధికారులు గుర్తించారు. ప్రభుత్వం రేపటి నుంచే ఈ పథకాన్ని ప్రారంభిస్తామని తాజాగా ప్రకటించింది.
Similar News
News January 7, 2026
నర్సంపేట నుంచి మేడారానికి బస్సు సర్వీసు ప్రారంభం

నర్సంపేట ఆర్టీసీ డిపో నుంచి మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు బస్సు సర్వీసును బుధవారం ప్రారంభించారు. జాతరకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఈ సర్వీసును ప్రారంభించినట్లు నర్సంపేట డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మీ తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో సురక్షిత ప్రయాణాన్ని భక్తుల సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రయాణికుల సంఖ్యను బట్టి బస్సులను పెంచుతామన్నారు.
News January 7, 2026
ఛత్రపతి శివాజీపై తప్పుడు రాతలు.. ఆక్స్‌ఫర్డ్ ప్రెస్ బహిరంగ క్షమాపణ

జేమ్స్ లైన్ రాసిన ‘శివాజీ: హిందూ కింగ్ ఇన్ ఇస్లామిక్ ఇండియా’ పుస్తకంలో అవాస్తవాలు ప్రచురించినందుకు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ (OUP) ఎట్టకేలకు క్షమాపణలు చెప్పింది. 2003లో వెలువడిన ఈ పుస్తకంలోని అభ్యంతరకర వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడమే కాకుండా పుణేలోని పరిశోధనా సంస్థపై దాడులకు దారితీశాయి. శివాజీ మహారాజ్ 13వ వారసుడు ఉదయన్‌రాజే భోసలే సహా ప్రజల మనోభావాలు దెబ్బతిన్నందుకు OUP విచారం వ్యక్తం చేసింది.
News January 7, 2026
NRPT: స్త్రీనిధి యాప్‌తో మహిళలకు ఆర్థిక భరోసా

మహిళా స్వయం సహాయక సంఘాల బలోపేతానికి ప్రభుత్వం ‘స్త్రీనిధి’ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా సభ్యులు రుణాల దరఖాస్తు, చెల్లింపులు, ఖాతా వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో సులభంగా తెలుసుకోవచ్చు. అవకతవకలకు తావులేకుండా, తక్షణ ఆర్థిక సహాయం పొందడానికి ఈ యాప్ కీలకంగా మారిందని అధికారులు తెలిపారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు ఇది ఎంతగానో దోహదపడుతోంది.


