News April 7, 2025
మేడ్చల్ జిల్లాలో విపరీతంగా ఉక్కపోత..!

మేడ్చల్ జిల్లాలో ఉక్కపోత రోజురోజుకు అధికమవుతోంది. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటడంతో ఉప్పల్, ఈసీఐఎల్, మేడ్చల్, మల్లాపూర్ ప్రాంతాల్లో తీవ్ర ఉక్కపోత ఉంటుందని TGDPS తెలిపింది. బాడీ డీ హైడ్రేట్ అవ్వకుండా తగినన్ని నీళ్లు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలు, వృద్ధులు పట్ల మరింత జాగ్రత్త పడాలన్నారు.
Similar News
News April 9, 2025
అమరావతిలో పెరిగిన భూముల అమ్మకాలు!

AP: అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు లోపలున్న గ్రామాల్లో భూముల విక్రయాలు ఒక్కసారిగా పెరిగినట్లు తెలుస్తోంది. రావెల పట్టణ పరిధిలోని గ్రామాల్లో చాలా మంది ఎకరాల కొద్ది భూములు కొనుగోలు చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇక్కడ ఎయిర్‌పోర్టుతో పాటు, లాజిస్టిక్ పార్క్ వచ్చే అవకాశం ఉండటంతో రియల్ఎస్టేట్ ఊపందుకున్నట్లు సమాచారం. దీంతో అక్కడ గజం రేటు రూ.20వేలకు పైగా పెరిగిపోయినట్లు నెట్టింట చర్చ జరుగుతోంది.
News April 9, 2025
పర్యాటక ప్రాంతాల అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి: కలెక్టర్

ఖమ్మం: పర్యాటక ప్రాంతాల అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టర్ కలెక్టరేట్లో పర్యాటక ప్రాంతాల అభివృద్ధి,అటవీ, రెవెన్యూ భూముల సమస్యలపై అటవీ, రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఖమ్మం వెలుగుమట్లలో ఇటీవల అగ్ని ప్రమాదం కావాలని చేసిందని, కేసు నమోదుచేసినట్లు చెప్పారు. అటు సత్తుపల్లి నీలాద్రి అర్బన్ పార్క్ అభివృద్ధికి చర్యలు చేపట్టామన్నారు.
News April 9, 2025
తిరుపతి-పాకాల-కాట్పాడి డబ్లింగ్ పనులకు కేంద్రం ఆమోదం

తిరుపతి-పాకాల-కాట్పాడి సింగిల్ రైల్వే లైన్ (104km) డబ్లింగ్ పనులకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దాదాపు రూ.1,322కోట్లతో చేపట్టే ఈ పనుల ద్వారా 400 గ్రామాల్లోని 14 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. దీని ద్వారా 35 లక్షల పని దినాల కల్పన, పర్యాటకంగా అభివృద్ధి జరుగుతుందన్నారు. ఏడాదికి 4M టన్నుల సరకు రవాణాకు కూడా అవకాశం ఏర్పడుతుందని తెలిపారు.