News January 17, 2026
మేడ్చల్ జిల్లాలో వ్యవసాయమే జీవనాధారం..!

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ రంగమే ప్రధాన జీవనాధారంగా సుమారు 40,872 మంది రైతులు, 19,000 మంది వ్యవసాయ కూలీలు జీవనం కొనసాగిస్తున్నారని అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. జిల్లా గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం కీలక పాత్ర పోషిస్తుందని.. రైతులు, కూలీలపై ఆధారపడి అనేక కుటుంబాలు జీవిస్తున్నాయని ఈ వివరాలు స్పష్టం చేస్తున్నాయి.
Similar News
News February 6, 2026
VZM: ఈ నెల 7న 20 సూత్రాల కమిటీ ఛైర్మన్ పర్యటన

ఈ నెల 7న 20 సూత్రాల కమిటీ ఛైర్మన్ లంక దినకర్ జిల్లాలోని పలు ప్రాంతాలలో పర్యటించనున్నారు. శుక్రవారం రాత్రి 9:30 గంటలకు విజయనగరం చేరుకుని బస చేస్తారు. శనివారం ఉదయం 10:30 గంటలకు కలెక్టరేట్‌లో కేంద్ర ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టుల అమలుపై సమీక్షిస్తారు. మధ్యాహ్నం 1:30 గంటలకు పత్రికా సమావేశం, 2:30లకు NDA నాయకులతో సమావేశం నిర్వహిస్తారు. అనంతరం తిరిగి విశాఖకు వెళ్తారని జిల్లా సమాచార శాఖ గురువారం తెలిపింది.
News February 6, 2026
ఫిబ్రవరి 6: చరిత్రలో ఈరోజు

✒ 1890: స్వాతంత్ర్య సమర యోధుడు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ జననం ✒ 1931: సమరయోధుడు మోతిలాల్ నెహ్రూ మరణం ✒ 1932: రచయిత భమిడిపాటి రామగోపాలం జననం ✒ 1947: ప్రముఖ రచయిత్రి కె.వి.కృష్ణకుమారి జననం ✒ 1956: AP అసెంబ్లీ తొలి మహిళా స్పీకర్ ప్రతిభా భారతి జననం ✒ 2008: హాస్యనటి కల్పనా రాయ్ మరణం ✒ 2022: సింగర్ లతా మంగేష్కర్ మరణం(ఫొటోలో)
News February 6, 2026
NZB: రూ.21 కోట్ల రోడ్ల పనులకు CM శంకుస్థాపన

సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం జిల్లాలో పలు రోడ్డు నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో గాంధీనగర్ నుంచి బినోలా రోడ్డు వరకు, పీడబ్ల్యూడీ & జేఎన్‌ఎన్ రోడ్డు నుంచి సిరన్‌పల్లి మీదుగా నిజాంపూర్ వరకు రోడ్డు వెడల్పు, బలోపేత పనులకు భూమి పూజ చేయనున్నారు. ఈ పనులను రూ.21 కోట్ల వ్యయంతో చేపట్టనున్నారు.


