News December 29, 2025
మేడ్చల్ జిల్లాలో 3 మున్సిపాలిటీలకు ఎన్నికలు!

మేడ్చల్ జిల్లాలో ఎన్నికల నగారా మోగనుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం మున్సిపల్ ఎన్నికలకు EC సమాయత్తం అవుతోంది. GHMC విలీనం అనంతరం మేడ్చల్ జిల్లాలో మిగిలిన 3 మున్సిపాలిటీల్లో ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్లు అధికారిక జాబితా వెల్లడైంది. అలియాబాద్‌లో 20 వార్డుల్లో జానాభా 18,876, మూడుచింతలపల్లి 24 వార్డుల్లో 24,214, ఎల్లంపేట 24 వార్డులకు 25,823గా జనాభా సంఖ్య ఉంది.
Similar News
News December 30, 2025
మేడారం 8 జోన్లు, 47 సెక్టార్లుగా విభజన

మేడారం జాతర కోసం అధికారులు సమాయత్తమయ్యారు. మేడారం జాతర జరిగే ప్రాంతాన్ని 8 జోన్లుగా విభజించి, 47 సెక్టార్లుగా ఏర్పాటు చేశారు. JAN 1 నుంచి జోన్ ఇన్‌ఛార్జిలు బాధ్యతలు చేపట్టాలని ములుగు కలెక్టర్ దివాకర ఆదేశాలు జారీ చేశారు. భక్తులతో అనుబంధం కలిగిన 24 ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అధికారులను జాతరకు వినియోగిస్తున్నారు. జోన్ అధికారులుగా జిల్లాలో పని చేస్తున్న 8 మంది జిల్లా స్థాయి అధికారులను నియమించారు.
News December 30, 2025
నేడు ఉత్తర ద్వార దర్శనం చేసుకోలేకపోతే?

నేడు ఉత్తర ద్వార దర్శనం చేసుకోలేని వారికి ఇతర పరిహారాలెన్నో ఉన్నాయి. పండితుల సూచన ప్రకారం.. విష్ణుమూర్తి పటం ముందు దీపం వెలిగించి, ఆయనను మనస్ఫూర్తిగా పూజిస్తే వైకుంఠ ద్వార దర్శన భాగ్యం దక్కినట్లేనట. అలాగే ‘వైకుంఠ ఏకాదశి వ్రతం’ ఆచరించాలని సూచిస్తున్నారు. ఉపవాసం, జాగరణ, విష్ణు సహస్రనామ పారాయణలతో ఉత్తర ద్వార దర్శనంతో సమానమైన ఫలితం దక్కుతుందని, వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
News December 30, 2025
పల్నాడు: చైనా మాంజాలపై జాగ్రత్త

త్వరలో వరుస సెలవులు వస్తున్న నేపథ్యంలో పిల్లలు వాడే గాలిపటాల దారాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పలువురు కోరుతున్నారు. మార్కెట్‌లలో ఇప్పటి ముబ్బడిగా చైనా మాంజాలు అమ్మకాలు కొనసాగిస్తూ ఉండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాంజాలు గాలిపటాల నుండి విడిపోయి రహదారులపై ప్రయాణం చేసే వాహనదారులకు తగిలి ప్రాణాలు సైతం కోల్పోయిన సంఘటనలు అనేకం ఉన్నాయి. చైనా మాంజాలను అమ్మకాలు జరుపుకుంటా చూడాలని కోరుతున్నారు


