News March 1, 2025
మేడ్చల్ జిల్లా వాసులకు రేషన్ కార్డులు

మేడ్చల్ జిల్లాలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి అధికారులు గుడ్ న్యూస్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 6,700 రేషన్ కార్డులు జారీ అయ్యాయి. వారందరూ రేషన్ తెచ్చుకోవచ్చని సివిల్ సప్లై అధికారిని సుగుణ బాయి తెలిపారు. ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన కులగణన సర్వేలో సేకరించిన సమాచారం ఆధారంగా ప్రభుత్వం ఈ రేషన్ కార్డులను జారీ చేసినట్లు సివిల్ సప్లయ్ శాఖ అధికారికంగా ప్రకటించింది.
Similar News
News March 1, 2025
నాలుగోసారి సీఎంను.. ఏం చేయాలో దిక్కు తోచట్లేదు: సీఎం చంద్రబాబు

AP: అడవి పందులు తిన్నంత తిని పంటలను తొక్కేసి పోతాయని, ఐదేళ్ల వైసీపీ పాలన ఇలాగే సాగిందని CM CBN విమర్శించారు. ‘మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ హామీలు ఇచ్చా. 2014-19 కంటే ఎక్కువ చేస్తానని ప్రజలంతా అనుకుంటున్నారు. కానీ అధికారంలోకి వచ్చాక పరిస్థితి అర్థమైంది. ఆర్థికంగా లోతైన గోతులున్నాయి. నాలుగోసారి CM అయిన నాకే ఏం చేయాలో దిక్కుతోచట్లేదు. కేంద్ర సహకారంతో రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నా’ అని తెలిపారు.
News March 1, 2025
ఏలూరు: రైలు ఢీకొని వృద్ధుడి మృతి

ఏలూరుకు చెందిన షేక్ చాన్ బాష (64) గన్ బజార్ సెంటర్ సమీపంలోని రైలు పట్టాలు దాటుతుండగా అటుగా వస్తున్న రైలు ఢీకొని శనివారం మృతి చెందాడు. ఈ ఘటనపై రైల్వే ఎస్ఐ పీ.సైమన్ కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని ఆయన చెప్పారు. పోస్టుమార్టం అనంతరం మృతుడి కుటుంబీకులకు మృతదేహాన్ని అందిస్తామని ఎస్ఐ చెప్పారు.
News March 1, 2025
మహిళల కోసం కొత్త కార్యక్రమాలు.. అధ్యయనానికి కమిటీ: మంత్రి

TG: దేశంలోనే అత్యుత్తమ మహిళా సాధికారత విధానాన్ని రూపొందించేందుకు కట్టుబడి ఉన్నామని మంత్రి సీతక్క తెలిపారు. ఈనెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహణపై సచివాలయంలో సమీక్షించారు. రాష్ట్రంలో మహిళల కోసం అమలవుతోన్న పథకాలపై చర్చించారు. మహిళా సాధికారత కోసం కొత్త కార్యక్రమాలు, ఇతర రాష్ట్రాల మహిళా సంక్షేమ విధానాల అధ్యయనం కోసం ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.