News January 27, 2025
మేడ్చల్: టెన్త్ పరీక్షల కోసం 40 రోజుల PLAN

మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు దగ్గర పడుతున్న వేళ 40 రోజుల ప్రత్యేక ప్రణాళికను అన్ని పాఠశాలల్లో అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా ప్రత్యేక టెస్టులు నిర్వహించనున్నట్లు DEO విజయ కుమారి తెలిపారు. ప్రతిరోజు ప్రత్యేక తరగతులు, ప్రీ ఫైనల్, వార్షిక పరీక్షల కోసం కసరత్తు జరగనుందని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 100% ఉత్తీర్ణత సాధించడం లక్ష్యంగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
Similar News
News October 27, 2025
MHBD: 61లిక్కర్ షాపులకు లక్కీ పర్సన్స్ ఎవరో..!

మహబూబాబాద్ జిల్లాలో 61 లిక్కర్ షాపులు ఉన్నాయి. ఈ నెల 23న లిక్కర్ షాపులకు దరఖాస్తుల గడువు ముగిసింది. జిల్లాలో 61 లిక్కర్ షాపులకు 1800 దరఖాస్తులు అందాయి. AB ఫంక్షన్ హాల్లో సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో డ్రా తీయనున్నారు. లక్కీ డ్రా లో 61 లక్కీ పర్సన్స్ ఎవరనేది తేలనున్నది. కొత్త లిక్కర్ షాపులను కేటాయించనున్నారు.
News October 27, 2025
NZB: నేడు ‘లక్కీ’గా వైన్స్‌లు దక్కేదెవరికి?

మద్యం షాపుల టెండర్లకు నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులు రేపు లక్కీ డ్రా తీయనున్నారు. జిల్లాలోని 102 లిక్కర్ షాపులకు 2,786 దరఖాస్తులు వచ్చాయి. దీనితో జిల్లా ఎక్సైజ్ శాఖకు ఒక్కో టెండర్‌కు రూ.3 లక్షల చొప్పున రూ83.58కోట్ల ఆదాయం లభించింది. లక్కీ డ్రాలో అదృష్టం ఎవరిని వరించనుందో చూడాలి. అయితే గత టెండర్లలో 3,759 దరఖాస్తులు రాగా.. ఈసారి టెండర్లను రూ.3 లక్షలకు పెంచడంతో దరఖాస్తులు తగ్గాయి.
News October 27, 2025
KMR: ‘లిక్కర్ లక్కు’ ఎవరిని వరించనుంది..?

కామారెడ్డి జిల్లాలోని 49 వైన్స్ షాపుల కేటాయింపు కోసం జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సమక్షంలో నేడు లక్కీ డ్రా నిర్వహించనున్నారు. జిల్లాలో ఉన్న 49 వైన్స్ షాపులకు గాను 1502 దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వానికి రూ. 45.06 కోట్ల ఆదాయం సమకూరింది. సోమవారం నిర్వహించే లక్కీ డ్రాలో ఎవరి అదృష్టం వరిస్తుందో, మద్యం షాపులు ఎవరికి దక్కుతాయోనని జిల్లా వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.


