News November 11, 2025
మేడ్చల్: నూతన ఇంటి గృహప్రవేశం.. చిందిన రక్తం

నూతన ఇంటి గృహప్రవేశం సందర్భంగా యజమానిని హిజ్రాలు డబ్బుల కోసం బెదిరించడమే కాకుండా, కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన కీసర మండలం చీర్యాలలోని బాలాజీ ఎంక్లేవ్‌లో సదానందం ఇంట్లో చోటుచేసుకుంది. వేడుకకు వచ్చిన ఇద్దరు హిజ్రాలు రూ.1లక్ష డిమాండ్ చేశారు. యజమాని నిరాకరించగా, 15 మంది హిజ్రాలు 3 ఆటోల్లో వచ్చి కుటుంబ సభ్యులను కర్రలతో కొట్టారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News November 11, 2025
వరంగల్: క్వింటా పత్తి ధర రూ.6,830

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మంగళవారం పత్తి ధర స్వల్పంగా పెరిగింది. సోమవారం రూ.6,800 పలికిన క్వింటా పత్తి ధర నేడు రూ.6,830 అయింది. రూ.7 వేలకు పైగా ధర పెరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. చలికాలం ప్రారంభమైన నేపథ్యంలో తేమలేని పత్తి మార్కెట్‌కు తీసుకురావాలని సూచిస్తున్నారు.
News November 11, 2025
సూర్యాపేట: ‘సార్’ ఐడియా.. హాజరు శాతం పెరిగింది

గరిడేపల్లి మండలం రంగాపురం పాఠశాలలో విద్యార్థులను బడికి రప్పించేందుకు ఉపాధ్యాయుడు చారగండ్ల రాజశేఖర్ వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చారు. సరిగా బడికి రాని పిల్లలకు ‘రోజుకో రూపాయి’ ఇస్తానని ప్రకటించారు. చిన్న చిన్న బహుమతులే పిల్లల జీవితాల్లో మార్పులు తెస్తాయని ఆయన తెలిపారు. ఈ ప్రయత్నంతో ఆరుగురు మాత్రమే ఉన్న ఈ పాఠశాలలో ప్రస్తుతం 20 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
News November 11, 2025
HYD: “ఏ బాబు లెవ్”.. ఓటెయ్!

జూబ్లీహిల్స్‌లో పోలింగ్ నెమ్మదిగా సాగుతోంది. తొలి రెండు గంటల్లో 10.02 శాతం మాత్రమే నమోదు అయ్యింది. ఓటర్లు ఇకనైనా మేల్కొనాలని SMలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ‘ఏ బాబు లెవ్.. ఓటెయ్’ అంటూ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. సెలవు ఉంటే నగరవాసులు కాస్త ఆలస్యంగానే లేస్తారని ఓ అధికారి సైతం గుర్తుచేశారు. కానీ, మరీ ఆలస్యం అయ్యింది. ఇకనైనా మేల్కొండి. ఓటింగ్ పర్సంటేజ్‌ను పెంచండి.
SHARE IT


