News February 13, 2026
మేడ్చల్: పురపోరులో ఎగిసిన ‘యువ’ కెరటాలు

ఎల్లంపేట్ మున్సిపాలిటీలో ఐదుగురు యువ కౌన్సిలర్లు గెలుపొందారు. 7వ వార్డు నుంచి బందేల కుమార్, 8వ వార్డు లావుడ్య శ్రీదేవి, 11వ వార్డు గోషిక అఖిల, 18వ వార్డు ఓం ప్రకాశ్ గౌడ్, 10వ వార్డు నిరుగంటి శ్రీలత గెలుపొందారు. 24 మంది కౌన్సిలర్ అభ్యర్థులలో ఐదుగురు యువ నాయకులు ప్రజాప్రతినిధులుగా గెలుపొందడం మేడ్చల్ మండల చరిత్రలో ఇదే మొదటిసారి. ఈ ఐదుగురు BRS పార్టీ నిలబెట్టినవారే.
Similar News
News February 14, 2026
కామారెడ్డి మున్సిపల్ ఛైర్మన్ అంశంపై నేతల సమగ్ర చర్చ

కామారెడ్డి మున్సిపల్ నూతన ఛైర్మన్ నియామకంపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ నివాసంలో సమావేశం జరిగింది. ఈ భేటీలో డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్, రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నేరెళ్ల శారద, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఛైర్మన్అ భ్యర్థి ఎంపికపై నేతల మధ్య సుదీర్ఘంగా చర్చ జరిగినట్లు సమాచారం.
News February 14, 2026
నేషనల్ షుగర్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు

నేషనల్ షుగర్ ఇన్‌స్టిట్యూట్ 4 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డిప్లొమా, ఇంటర్, టెన్త్ అర్హతగల వారు మార్చి 15 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 27ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://nsi.gov.in
News February 14, 2026
యనమలకుదురు ఆలయ చరిత్ర ఇదే..!

విజయవాడ నగర సమీపంలోని యనమలకుదురులో కృష్ణానది తీరాన ఉన్న పార్వతీ రామలింగేశ్వర స్వామి ఆలయం వేల ఏళ్ల చరిత్రతో ప్రసిద్ధి చెందింది. పురాణ కథనం ప్రకారం ఇక్కడ స్వయంభూ వెలసిన లింగాన్ని పరమశివుని శిష్యుడైన పరశురాముడు వేదోక్తంగా పునఃప్రతిష్ఠించడంతో ‘పరశురామశివుడు’గా పూజలు అందుకుంటున్నట్లు పురాణ గాథ. ఒకప్పుడు వేయిమంది మునులు ఇక్కడ తపస్సు చేయడంతో ఈ క్షేత్రానికి ‘వేయిమునుల కుదురు’ అనే పేరు వచ్చింది.


