News April 8, 2025
మేడ్చల్: ప్రజావాణిలో 82 ఫిర్యాదుల స్వీకరణ

జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల సమస్యల అర్జీలను డీఆర్ఓ హరిప్రియతో కలిసి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి స్వీకరించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 82 ఫిర్యాదులు అందాయన్నారు. సంబంధిత శాఖల జిల్లా అధికారులు స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాలని సూచించారు.
Similar News
News July 6, 2025
HYD: నేడు సాలార్ జంగ్ మ్యూజియానికి సెలవు

మొహరం నేపథ్యంలో బీబీ కా ఆలం ఊరేగింపులో భాగంగా నేడు HYDలోని సాలార్ జంగ్ మ్యూజియానికి సెలవు ఉంటుందని మ్యూజియం అడ్మినిస్ట్రేటివ్ అధికారి తెలిపారు. అదేవిధంగా బీబీ కా ఆలం ఊరేగింపు చార్మినార్ ప్రధాన మార్గాల్లో కొనసాగనున్న నేపథ్యంలో చార్మినార్లోకి ప్రవేశం ఉండదన్నారు. సోమవారం తిరిగి సాలార్ జంగ్ మ్యూజియంలోకి ప్రవేశం ఉంటుందని పేర్కొన్నారు.
-SHARE IT
News July 6, 2025
మాలిలో మాచర్ల యువకుడు కిడ్నాప్.. విదేశాంగ శాఖకు లేఖ

మాలిలో మాచర్లకు చెందిన అమరలింగేశ్వరరావును<<16955422>> ఉగ్రవాదులు<<>> కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. జులై 1న ఏస్ నగరంలోని సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ఉగ్రవాదులు అమరలింగేశ్వరరావుతో పాటు మరో ముగ్గురిని కిడ్నాప్ చేశారు. అమరలింగేశ్వరరావు 11 ఏళ్లుగా మాలిలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన భార్యాబిడ్డలు HYDలో ఉంటున్నారు. తమ కుమారుడిని విడిపించాలని కుటుంబ సభ్యులు కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలువగా ఆయన విదేశాంగ శాఖకు లేఖ రాశారు.
News July 6, 2025
వడమాలపేట: TTDలో ఉద్యోగాల పేరుతో మోసం

వడమాలపేట మండలం అమ్మగుంట హరిజనవాడకు చెందిన పులి శేఖర్ అనే వ్యక్తి TTDలో ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్నాడు. అతనితోపాటు డిగ్రీ చదివిన వారికి ఫోన్ చేసి TTDలో ఉద్యోగాలు అంటూ ఆశ చూపి వేలుకు వేలు తీసుకుని ముఖం చాటేస్తున్నాడని బాధితులు వాపోయారు.