News February 12, 2025
మేడ్చల్: ఫీజు కోసం వేధింపులు.. ఆత్మహత్యాయత్నం

మేడ్చల్లో స్కూల్ ఫీజుల వేధింపులు తాళలేక ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. బాధితురాలి తల్లి ఆవేదన.. పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న తమ కుమార్తె అఖిలను పాఠశాల ప్రిన్సిపల్ ఫీజు కోసం వేధించడంతో ఆత్మహత్యకు యత్నించింది. ప్రస్తుతం అఖిల ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కాగా.. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Similar News
News January 11, 2026
ఇకపై ప్రతివారం ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు: భట్టి

TG: ఇకపై ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రతి వారం నిధులు మంజూరు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. లబ్ధిదారులు వేగంగా నిర్మాణ పనులు పూర్తి చేసుకోవాలని రామగుండం పర్యటనలో అన్నారు. స్థానికంగా 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కాగా ఇప్పటివరకు నిధుల లభ్యతను బట్టి సోమవారం రోజున ఇందిరమ్మ ఇళ్ల నిధులు మంజూరు చేసిన సంగతి తెలిసిందే.
News January 11, 2026
విశాఖ పోలీసుల పనితీరును ప్రశంసించిన సీఎం

విశాఖలో ఓ మహిళపై జరిగిన దాడిలో నిందితుడిని అదుపులోకి తీసుకున్న విశాఖ పోలీసులను సీఎం చంద్రబాబు అభినందించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు స్పందించారని సీఎం కొనియాడారు. విశాఖలో శాంతిభద్రతలు అద్భుతంగా ఉన్నాయనేందుకు ఇది నిదర్శనమన్నారు. మహిళలకు రక్షణ విషయంలో దేశంలోనే విశాఖ మొదటి స్థానంలో ఉందన్నారు. విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తే సహించేది లేదన్నారు.
News January 11, 2026
మంచిర్యాల: యువజన విభాగం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల నియామకం

మంచిర్యాల జిల్లాలోని వివిధ మండలాలకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ యువజన విభాగం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను నియమించినట్లు జిల్లా అధ్యక్షుడు మహేశ్ వర్మ తెలిపారు. దండేపల్లి సందవేణి కిరణ్, కార్తీక్ యాదవ్, మందమర్రి గొల్లపల్లి అజయ్ గౌడ్, సందీప్, నస్పూర్ సతీష్, రంజిత్, తాండూర్ ఎం.రంజిత్, కె.సందీప్, కోటపల్లి దుర్గం సుధాకర్, రాజమౌళిలను అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా నియమించారు.


