News January 27, 2025
మేడ్చల్: బాలామృతంతో పిల్లలకు బలం: శారద

బాలామృతంతో పిల్లలు బలంగా ఎదుగుతారని మేడ్చల్ జిల్లా ICDS ప్రాజెక్ట్ ఆఫీసర్ శారద తెలిపారు. 100 గ్రాముల బాలామృతంలో 11 గ్రాముల ప్రోటీన్లు, 167 మి.గ్రాముల కాల్షియం, ఐరన్, కంటికి కావలసిన విటమిన్-A, విటమిన్-B1, B2, B12, విటమిన్-C, ఫోలిక్ యాసిడ్, సూక్ష్మ పోషకాలు ఉంటాయన్నారు. మొత్తం 100 గ్రాముల బాలామృతంతో 414 కిలో క్యాలరీల శక్తి పిల్లలకు అందుతుందని, 7 నెలల నుంచి మూడేళ్లలోపు పిల్లలకు అందించాలని సూచించారు.
Similar News
News March 3, 2026
రోడ్డు ప్రమాదంలో కల్వకుర్తి ఆర్టీసీ డ్రైవర్ మృతి

వెల్దండ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కల్వకుర్తి ఆర్టీసీ డ్రైవర్ వంకుడావత్ గణేశ్ (32) దుర్మరణం చెందారు. బైక్‌ను డీసీఏం ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గణేశ్ మృతితో ఒంటి గుడిసె తాండలో విషాదం నెలకొంది.
News March 3, 2026
అనుమతి లేకుండా నియామకాలు వద్దు: కలెక్టర్

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎలాంటి కొత్త నియామకాలు చేపట్టొద్దని కలెక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో డీఎంహెచ్‌వో, ఆసుపత్రి సూపరింటెండెంట్లతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. నియామక ప్రక్రియకు సంబంధించి ముందస్తు నోటిఫికేషన్లు ఇవ్వరాదని స్పష్టం చేశారు. ఎంజీఎం, సీకేఎం, నర్సంపేట ఏరియా ఆసుపత్రి సహా రీజనల్ ఐ హాస్పిటళ్లలో త్వరలోనే మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు.
News March 3, 2026
ప.గో: గ్యాస్ లీక్.. పరిస్థితి విషమం

పెనుగొండ మండల శివాలయం సమీపంలో సోమవారం రాత్రి వంట గ్యాస్ లీకై నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. బాధితులు తమ్మ నాగేశ్వరరావు, లక్ష్మి, సమతం మణి, పల్లవిగా గుర్తించారు. వీరిలో మణి పరిస్థితి విషమంగా ఉండటంతో తణుకు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. తహశీల్దార్ అనితకుమారి బాధితులను పరామర్శించారు. అదృష్టవశాత్తూ ఎటువంటి ఆస్తి నష్టం జరగలేదు. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.


