News April 7, 2025
మేడ్చల్ మల్కాజిగిరిలో జీవో 59 అమలులో జాప్యం!

మేడ్చల్ జిల్లా పరిధిలో అనేక ప్రాంతాల్లో జీవో నంబర్ 59 కింద దరఖాస్తు చేసిన ప్రజలు 16 నెలలుగా సమస్యల పరిష్కారానికి ఎదురుచూస్తున్నారు. అనేక ఇళ్లకు అధికారిక గుర్తింపులేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ, అర్బన్ ల్యాండ్ సీలింగ్ (ULC) చట్టం కింద వచ్చిన సర్‌ప్లస్ భూముల్లో నిర్మాణాలు చేపట్టిన వారికి జీవో ప్రకారం కొన్ని షరతుల మేరకు, చెల్లింపుల ఆధారంగా భూమిని రెగ్యులరైజ్ చేస్తామని ప్రకటించారు.
Similar News
News April 9, 2025
HYD: నల్లాకు మోటర్ బిగిస్తే రూ.5 వేల జరిమానా!

నల్లాల నుంచి మోటార్ల ద్వారా నీటిని తోడితే కఠిన చర్యలు తీసుకుంటామని జలమండలి MD అశోక్ రెడ్డి హెచ్చరించారు. బుధవారం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. HMWSSB ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి సుదూర ప్రాంతాల నుంచి నీటిని శుద్ధి చేసి సరఫరా చేస్తోందని, వృథా చేయకుండా వాటిని తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించాలని కోరారు. నల్లాకు మోటర్ బిగిస్తే రూ.5 వేల జరిమానా విధిస్తామన్నారు.
News April 9, 2025
సంగారెడ్డి: వేసవిలో త్రాగునీటి సమస్య లేకుండా చూడండి: కలెక్టర్

వేసవిలో త్రాగునీటి సమస్య లేకుండా చూడాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. మున్సిపాలిటీలను 100% ఆస్తిపన్ను వసూలు చేయాలని సూచించారు. 25%కు రాయితీతో ఎల్ఆర్ఎస్ గడువు ఈనెల 30 వరకు పెంచినట్లు చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.
News April 9, 2025
భద్రాద్రి జిల్లా నేటి ముఖ్యాంశాలు..!

✓అశ్వాపురం ఎమ్మార్వో కార్యాలయాన్ని సందర్శించిన ఐటీడీఏ పీవో✓పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలి:CPM✓జూలూరుపాడులో బైక్ ను ఢీ కొట్టిన కారు.. ఇద్దరికీ తీవ్ర గాయాలు✓వక్ఫ్ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలి: మైనారిటీ సెల్ ✓సన్న బియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేసిన ఎమ్మెల్యే పాయం ✓నాటు తుపాకులతో ఉన్న వ్యక్తులను అదుపులో తీసుకున్న అశ్వారావుపేట పోలీసులు