News October 23, 2025

మేడ్చల్-మల్కాజిగిరిలో 5 వేలకు చేరువలో వైన్స్ టెండర్లు

image

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 88 మద్యం దుకాణాలకు మొత్తం 4,910 దరఖాస్తులు అందినట్లు DPEO నవీన్ తెలిపారు. దరఖాస్తుల గడువును ఎక్సైజ్ శాఖ 18 నుంచి 23వ తేదీ వరకు పొడిగించిన తర్వాత కేవలం 30 దరఖాస్తులు మాత్రమే అందినట్లు తెలిపారు. ఈరోజు చివరి రోజు కావడంతో మరికొన్ని దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. సా.5 గంటల వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగనున్నట్లు తెలిపారు. ఈనెల 27వ తేదీన డ్రా నిర్వహించనున్నారు.

Similar News

News October 23, 2025

WNP: అపార్ ఐడీ జనరేషన్ వేగవంతం చేయాలి: కలెక్టర్

image

వనపర్తి జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్స్‌కు కలెక్టర్ ఆదర్శ్ సురభి పలు ఆదేశాలు జారీ చేశారు. అపార్ ఐడీ జనరేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. డ్రాప్ అవుట్స్ విషయంలో ఫాలోఅప్ చేసి, విద్యార్థులు కళాశాలలకు వెళ్ళేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఏడాది ఇంటర్ బోర్డు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించేలా చూడాలని, వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశించారు.

News October 23, 2025

పదో తరగతి పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదల

image

TG: టెన్త్ ఫైనల్‌ ఎగ్జామ్ ఫీజు చెల్లింపు తేదీలను స్కూల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టరేట్ ప్రకటించింది. OCT 30-NOV 13లోపు HMలకు ఫీజు చెల్లించాలని తెలిపింది. వాళ్లు ఆన్‌లైన్‌‌లో NOV 14లోపు ఫీజు చెల్లించాలని, విద్యార్థుల డేటాను నవంబర్‌ 18లోపు DEOలకు అందించాలని పేర్కొంది. రూ.50 ఆలస్య రుసుముతో నవంబర్‌ 29 వరకు, రూ.200తో DEC 2-11 వరకు, రూ.500 లేట్ ఫీజ్‌తో DEC 15-29 వరకు చెల్లించేందుకు అవకాశం కల్పించింది.

News October 23, 2025

జగిత్యాల: తేమ శాతం ఇంత ఉంటేనే మద్దతు ధర

image

హార్వెస్టర్ యజమానులు పంట పూర్తిగా పక్వానికి వచ్చిన తర్వాత మాత్రమే కోత ప్రారంభించాలని, మిషిన్లోని బ్లోయర్ సక్రమంగా ఆన్లో ఉంచాలని, ఆర్పీఎం 19- 20 కంటే తక్కువగా ఉండకూడదని జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్ సూచించారు. జగిత్యాలలో హార్వెస్టర్ యజమానులతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ధాన్యం నాణ్యత దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ధాన్యంలోని తేమ 17%లోపే ఉంచితే మద్దతు ధర లభిస్తుందన్నారు.