News April 29, 2024

మేడ్చల్: మినీ గ్యాస్‌ సిలిండర్‌తో తలపై బాది హత్య

image

మినీ గ్యాస్‌ సిలిండర్‌తో తలపై బాది దారుణంగా హత మార్చిన ఘటన మేడ్చల్ PS పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలు.. ఛత్తీస్‌గడ్‌ రాష్ట్రానికి చెందిన లక్కు(40)కి రాజు అనే వ్యక్తితో 3 రోజుల క్రితం గొడవ జరిగింది. దీంతో లక్కు లక్ష్మీదుర్గా షాపులో షట్టర్‌ వద్ద నిద్రిస్తుండగా రాజు మినీ గ్యాస్‌ సిలిండర్‌తో దాడి చేసి హతమార్చాడు. అనంతరం నిందితుడు జీనోమ్ వ్యాలీ PSలో లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News September 24, 2024

HYD: డిగ్రీ సీట్లకు 25 నుంచి స్పాట్ ప్రవేశాలు

image

దోస్త్ పరిధిలోని ప్రైవేట్, ప్రైవేట్ ఎయిడెడ్ కళాశాలల్లో స్పాట్ ప్రవేశాలు జరగనున్నాయి. ఈ నెల 25 నుంచి 27 వరకు స్పాట్ విధానంలో సీట్లను ఆయా కళాశాలల యాజమాన్యాలు భర్తీ చేసుకోవచ్చని దోస్త్ కన్వీనర్ ప్రొ.ఆర్. లింబాద్రి తెలిపారు. స్పాట్ కౌన్సిలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులు ఓరిజినల్ బోనఫైడ్ సర్టిఫికేట్స్, ఫొటో, ఆధార్ కార్డ్, 2 జిరాక్సు సెట్స్ తీసుకురావాలని కోరారు.

News September 24, 2024

పటాన్‌చెరులో నేడు రేషన్ డీలర్ల సభ

image

నేడు పటాన్చెరులో న్యాయమైన డిమాండ్‌లకు రేషన్ డీలర్ల భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారని రాష్ట్ర అధ్యక్షుడు గూడెం మహిపాల్ రెడ్డి (MLA), రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ నాయికోటి రాజు తెలిపారు. ఓ కన్వెన్షన్ హాల్‌లో జరిగే సభకి జిల్లాల నుంచి భారీ సంఖ్యలో డీలర్లు హాజరు కానున్నారు. అలాగే ఈ సభకు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా హాజరుకానున్నారని రేషన్ డీలర్ల సంఘం సభ్యులు తెలిపారు.

News September 24, 2024

HYD: ఇకపై అన్నింటికీ ఒకే డిజిటల్ కార్డు

image

రాష్ట్రంలో రేషన్, ఆరోగ్యం, ఇతర సంక్షేమాలన్నింటికీ ప్రతి కుటుంబానికి ఒకే ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఉండేలా ప్రభుత్వం కార్యాచరణకు పూనుకుంది. HYDలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రత్యేక మీటింగ్ నిర్వహించారు. కుటుంబ సభ్యుల మార్పు, చేర్పులు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకునేలా ఈ కార్డు రూపొందించనున్నారు. సమగ్ర కుటుంబ వివరాల నమోదుపై ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలని సీఎం ఆదేశించారు.