News January 27, 2025

మేడ్చల్: రైతు భరోసా కోసం 378 దరఖాస్తులు

image

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఇటీవల జరిగిన గ్రామ, వార్డు సభల్లో రైతు భరోసా పథకానికి సంబంధించి రైతుల నుంచి తీసుకున్న దరఖాస్తుల రిపోర్టును అధికారులు వెల్లడించారు. జిల్లావ్యాప్తంగా 378 మంది రైతులు రైతు భరోసా కోసం దరఖాస్తులు పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. రైతుల దరఖాస్తులను పరిశీలించిన అనంతరం, ప్రభుత్వానికి ఈ వివరాలను పంపనున్నారు. 

Similar News

News November 16, 2025

ఇల్లంతకుంట: ‘ఇందిరమ్మ ఇండ్లతో సొంతింటి కల నెరవేరుతోంది’

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకంతో సొంత ఇంటి కల నెరవేరుతున్నదని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలోని రైతు వేదికలో శనివారం ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించగా, ముఖ్య అతిథిగా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరయ్యారు

News November 16, 2025

కరీంనగర్: ట్రాఫిక్ ఉల్లంఘనలపై కఠిన చర్యలు: సీపీ

image

తమ కార్యాలయ పరిధిలో కొంతమంది పోలీసులు నెంబర్‌ప్లేట్‌ లేని వాహనాలు, హెల్మెట్/సీట్‌బెల్ట్ ధరించకపోవడం, బ్లాక్ ఫిల్మ్‌ వాడటం వంటి ట్రాఫిక్ ఉల్లంఘనలు చేస్తున్నట్లు గుర్తించిన సీపీ, కట్టుదిట్టమైన చర్యలకు ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించేవారికి, పోలీసులు అయినా సరే, కఠినంగా ఈ-చలాన్లు జారీ చేయాలని ఏసీపీ ట్రాఫిక్‌కు ఆయన స్పష్టం చేశారు.

News November 16, 2025

STRANGE: ఈ ఊరిలో 450 మంది ట్విన్స్

image

ఒక ఊరిలో పది మంది కవలలు ఉంటేనే ఆశ్చర్యంగా చూస్తుంటారు. అలాంటిది 2వేల మంది జనాభా ఉన్న కేరళలోని ‘కొడిన్హి’లో ఏకంగా 450 జతల కవలలు ఉంటే ఇంకెలా ఉంటుంది. అక్కడ కవల పిల్లలు ఎక్కువగా పుట్టడం అంతుచిక్కని విషయంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధకులు, జన్యు శాస్త్రవేత్తలు ఇప్పటికీ నిర్దిష్టమైన కారణాన్ని మాత్రం గుర్తించలేకపోయారు. అయితే వలస వచ్చిన కుటుంబాలకూ కవలలు జన్మించడం విచిత్రం.