News April 4, 2025
మేడ్చల్: ‘సిగరెట్ తాగనీకి టైం లేనట్టుంది’

స్కూటీపై వెళ్లే ఈ అన్నకు సిగరెట్ తాంగేందుకు నిమిషం టైం లేనట్టుందని పలువురు విమర్శిస్తున్నారు. మేడ్చల్ జిల్లా శామీర్‌పేట రోడ్డులో స్కూటీపై ఓ చేతితో సిగరెట్ మరో చేతితో వేగంగా డ్రైవ్ చేస్తుండగా.. ఓ వ్యక్తి ఫోటో క్లిక్ మనిపించారు. సిగరెట్ పదేళ్లకు ఆరోగ్యం పాడు చేస్తే, ఈ డ్రైవింగ్ క్షణకాలంలో ప్రాణం తీస్తుందని పోలీసులు హెచ్చరించారు.
Similar News
News September 18, 2025
నల్లొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి కీలక ఆదేశాలు

పెండింగ్‌లో ఉన్న సదరం కేసులను వచ్చే నెలలోపు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి డీఆర్డీవో శేఖర్ రెడ్డిని ఆదేశించారు. గురువారం ఆమె నల్గొండలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో నిర్వహించే సదరం శిబిరాన్ని సందర్శించారు. పార్టిషన్ పనులు పూర్తయ్యాక, సదరం క్యాంపులను ఆసుపత్రి నూతన భవనంలో నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. పెండింగ్‌లో ఉన్న 2,564 సదరం దరఖాస్తులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు.
News September 18, 2025
వరుసగా మూడోరోజు లాభాల్లో ముగిసిన మార్కెట్లు

భారత స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిశాయి. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ తన కీలక వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించడం మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపింది. ముఖ్యంగా ఐటీ షేర్ల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. దీంతో సెన్సెక్స్ 320 పాయింట్లు లాభపడి 83,013 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 93 పాయింట్లు వృద్ధి చెంది 25,423 వద్ద ముగిసింది. ఫార్మా షేర్లు కూడా భారీగా లాభాలు ఆర్జించాయి.
News September 18, 2025
పటాన్ చెరు: ఎఫ్ఎల్ఎన్‌ను పగడ్బందీగా నిర్వహించాలి: డీఈఓ

పటాన్ చెరు మండలం రుద్రారం గ్రామ పంచాయతీ పరిధిలోని వీకర్ కాలనీలోని ప్రాథమిక పాఠశాలను జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో అమలవుతున్న ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమం గురించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. డీఈఓ మాట్లాడుతూ.. ఎఫ్ఎల్ఎన్‌ను పగడ్బందీగా నిర్వహించాలని, విద్యార్థులు గ్రంథాలయ పుస్తకాలను వినియోగించుకునేలా చూడాలని పేర్కొన్నారు.