News January 26, 2025
మేడ్చల్: 34,719 రేషన్ కార్డులకు సభల్లో ఆమోదం!

మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతాల్లో ప్రత్యేక గ్రామ, వార్డు సభలు ఇటీవల నిర్వహించిన అనంతరం తాజాగా రిపోర్టు వెల్లడైంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం రేషన్ కార్డులు కావాలని దరఖాస్తు చేసుకున్న 34,719 మంది వివరాలను గ్రామ, వార్డు సభల్లో ఉంచారు. అనంతరం ఆమోదం సైతం తీసుకున్నట్లుగా అధికారులు తెలిపారు. మరోవైపు అదే సభల్లో మరి కొంతమంది దరఖాస్తు చేసుకున్నారు.
Similar News
News December 7, 2025
NRPT: రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీల్లో జిల్లాకు మూడో స్థానం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ అండర్ -14 బాలుర క్రికెట్ పోటీలలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన బాలుర క్రికెట్ జట్టు మూడో బహుమతి సాధించింది. ఈ సందర్భంగా క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ అభినందించారు. రాబోయే రోజుల్లో ఆటలో చక్కటి ప్రతిభ చూపి మరిన్ని విజయాలు సాధించాలని అన్నారు. జిల్లా క్రీడల శాఖ అధికారి వెంకటేష్‌ను అభినందించారు.
News December 7, 2025
పవన్‌కు ‘అభినవ కృష్ణ దేవరాయ’ బిరుదు

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఉడుపి(KN)లోని పుట్టిగే శ్రీకృష్ణ మఠం పీఠాధిపతి శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీ ఆయనకు ‘అభినవ కృష్ణ దేవరాయ’ బిరుదును ప్రదానం చేశారు. ‘బృహత్ గీతోత్సవ’లో పవన్ మాట్లాడుతూ భగవద్గీత ఓ సారి చదివి ఎర్ర వస్త్రంతో కప్పి పూజా గదిలో దాచే గ్రంథం కాదన్నారు. మన జీవితంలో ప్రతి నిర్ణయం, సమస్యలకు పరిష్కారంగా మనల్ని నడిపించే జ్ఞానం భగవద్గీత అని పేర్కొన్నారు.
News December 7, 2025
పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేయాలి: ASF కలెక్టర్

2వ సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఈనెల 11వ తేదీన తొలి విడత సర్పంచ్,వార్డు సభ్యుల స్థానాలకు జరగనున్న ఎన్నికలకు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయాలని ASF కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. ఆదివారం ASF కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి తొలి విడత పోలింగ్ నిర్వహించే 5 మండలాల అధికారులు,మండల పంచాయతీ అధికారులు, జోనల్ అధికారులతో జూమ్ మీటింగ్ ద్వారా సమీక్ష నిర్వహించారు.


