News February 13, 2025
మేడ్చల్: DEO, MEO మిస్సింగ్ అని పోలీసులకు ఫిర్యాదు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739431057018_50135456-normal-WIFI.webp)
మేడ్చల్ జిల్లాలో విద్యాధికారులు ఉన్నారా అని SFI మేడ్చల్ జిల్లా కార్యదర్శి సంతోష్ ప్రశ్నించారు. పట్టణంలోని క్రిక్ పాఠశాలలో 4వ తరగతి విద్యార్థిని ఫీజు కట్టలేదని ఇంటికి పంపని ఘటన మరువకముందే, శ్రీ చైతన్య పాఠశాలలో ఫీజుల వేధింపులకు విద్యార్థిని ఆత్మహత్య చేసుకుని మృతి చెందిందన్నారు. చర్యలు తీసుకోవాల్సిన మేడ్చల్ డీఈఓ, ఎంఈఓ మిస్సింగ్ అయ్యారని SFI నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Similar News
News February 13, 2025
ముగ్గురు పాక్ ప్లేయర్ల ఓవరాక్షన్.. ఐసీసీ చర్యలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739447150055_695-normal-WIFI.webp)
ముక్కోణపు వన్డే(PAK-NZ-SA) సిరీస్‌లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో పాక్ ఆటగాళ్లు దురుసుగా ప్రవర్తించారు. దీంతో ICC కొరడా ఝుళిపించింది. SA బ్యాటర్ మాథ్యూను ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్న షాహీన్ అఫ్రీదికి మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత పెట్టింది. అలాగే కెప్టెన్ బవుమాను రనౌట్ చేసిన తర్వాత సౌద్ షకీల్, కమ్రాన్ గెటౌట్ అంటూ రియాక్షన్ ఇచ్చారు. దీంతో ఐసీసీ వారిద్దరి ఫీజులో 10 శాతం కట్ చేసింది.
News February 13, 2025
నిజామాబాద్: ప్రయోగ పరీక్ష కేంద్రాలు తనిఖీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739444513393_51712009-normal-WIFI.webp)
పరీక్ష కేంద్రాలలో కెమెరాలు ఆగిపోకుండా ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ పని చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయా కళాశాలల ప్రిన్సిపల్‌లను DIEO రవికుమార్ ఆదేశించారు. గురువారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మూడో దశ ప్రయోగ పరీక్షలు ప్రారంభమయ్యాయి. కాగా పలు ప్రయోగ పరీక్షా కేంద్రాలను ఆయన గురువారం తనిఖీ చేశారు. నిబంధనల మేరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించాలని సూచించారు.
News February 13, 2025
అల్లూరి: ఒకే ఊరు.. రెండు మండలాలు..!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739443971844_60468871-normal-WIFI.webp)
తమ గ్రామంలో అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేయాలని రాజవొమ్మంగి మండలం రాజుపేట గిరిజనులు కోరుతున్నారు. ఐదేళ్లలోపు 32మంది బాలలు ఉన్నారన్నారు. రెండు వీధులుగా ఉన్న తమ గ్రామంలో ఎగువవీధి కొయ్యూరు మండలంలోకి.. దిగువ వీధి రాజవొమ్మంగి మండలంలోకి వస్తుందని చెప్తున్నారు. అనేకసార్లు రెండు మండలాల అధికారులకు విన్నవించుకున్నామని తెలిపారు. చేసేదిలేక చిన్నారులను పనుల వద్దకు తీసుకుపోతున్నామని తమ ఆవేదనను వెలిబుచ్చుకున్నారు.