News September 19, 2025

మేయర్, కమిషనర్ ప్రజలతో ఆటలాడటం తగదు: ఎమ్మెల్యే వంశీకృష్ణ

image

జైలు రోడ్డు ఫుడ్ కోర్ట్‌లో దుకాణాలను స్థానిక MLA అయిన తనకు సమాచారం ఇవ్వకుండా <<17758951>>తొలగించడం<<>>పై వంశీకృష్ణ శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మేయర్, కమిషనర్ ఒకరిపై ఒకరు నెపం వేసుకుంటూ ప్రజలతో ఆటలాడటం తగదని హెచ్చరించారు. ఫుడ్ కోర్ట్ వ్యాపారులు ఏళ్లుగా కష్టపడి దుకాణాలు నడుపుతున్నారని, ఒక్కసారిగా తొలగించడం అన్యాయం అని అన్నారు. తనకు సమాచారం ఇవ్వకుండా కౌన్సిల్‌లో తీర్మానం పెట్టడాన్ని తప్పుపట్టారు.

Similar News

News September 19, 2025

యారాడ కొండపై కనకదుర్గమ్మ.. ప్రత్యేక బోటు ఏర్పాటు

image

యారాడ కొండపై వేంచేసి ఉన్న శ్రీసాగర్ గిరి కనక దుర్గ అమ్మవారి ఆలయంలో సెప్టెంబర్ 22 నుంచి దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 2 వరకు ఈఉత్సవాలు జరగనున్నాయి. పోర్టు వెంకటేశ్వరస్వామి ఆలయ జెట్టీ నుంచి యారాడకు ప్రత్యేక బోట్ సౌకర్యం కల్పిస్తారు. గత ఏడాది టికెట్ ధర రూ.40గా ఉంది. గాజువాక, సింధియా మీదుగా రోడ్డు మార్గంలో కూడా ఆలయానికి చేరుకోవచ్చు.

News September 19, 2025

విశాఖలో వెహికల్ రిటర్న్ మేళా

image

విశాఖ నగరంలో వివిధ కారణాలవల్ల స్వాధీనం చేసుకున్న వాహనాలను సీపీ వాహనదారులకు తిరిగి అందజేశారు. పోలీస్ గ్రౌండ్‌లో శుక్రవారం సీపీ శంఖబ్రత బాగ్చి 346 వాహనాలను వాహనదారులకు అందజేశారు. ఇదివరకు ఎన్నడూ లేని విధంగా ఇటువంటి కార్యక్రమం చేపట్టినట్లు సీపీ తెలిపారు. ఇప్పటివరకు మూడు వెహికల్ రిటర్న్ మేళా నిర్వహించి 818 మందికి వారి వాహనాలు అందించినట్లు వెల్లడించారు.

News September 19, 2025

విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ఢిల్లీ అధికారులు

image

ఢిల్లీ నుంచి స్టీల్ సెక్రటరీ సందీప్ పౌండ్రిక్, జాయింట్ సెక్రెటరీలు విశాఖ చేరుకున్నారు. వారు విశాఖ స్టీల్ ప్లాంట్‌ను నేడు సందర్శించనున్నారు. ఉత్పత్తి తగ్గుదల, బొగ్గు సమస్యపై అధికారులతో సమీక్షిస్తారు. అనంతరం ఎంపిక చేసిన అధికార ఉద్యోగ బృందాలతో సమావేశమౌతారు. స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం ప్యాకేజీ ఇచ్చిన తర్వాత ప్రతి మూడు నెలలకోసారి సమీక్షల్లో భాగంగా వస్తున్నట్లు సమాచారం.