News March 27, 2025

మేయర్ కలిసిన ఇండియానాలో పోలో బృందం

image

అమెరికాకు చెందిన ఇండియానాలో పోలో బృందం మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో భేటీ అయ్యింది. 2010లో ఇండియనా స్టేట్ పలు అంశాలపై సిస్టర్ సిటీ ఒప్పందం చేసుకుంది. ఈ నేపథ్యంలో మేయర్ ఆ బృందాన్ని సాదరంగా ఆహ్వానించి ధన్యవాదాలు తెలిపారు. సిస్టర్ సిటీ ఒప్పందంలో కార్యక్రమాలు నిర్వహిస్తామని ఇండియనా ప్రతినిధులు మేయర్‌కు వివరించారు.

Similar News

News February 16, 2026

ఖమ్మం: రేణుకా చౌదరికి ప్రివిలేజ్ కమిటీ నోటీసులు

image

కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరికి సభా హక్కుల ఉల్లంఘన కమిటీ నోటీసులు జారీ చేసింది. గతేడాది డిసెంబరులో పార్లమెంటు సమావేశాల సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా తన పెంపుడు కుక్కను వెంట తెచ్చుకోవడంతో పాటు, సహచర సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఫిర్యాదుల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంది. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశిస్తూ, ఈ నెల 23 లోపు సమాధానం సమర్పించాలని నోటీసులో స్పష్టం చేసింది.

News February 16, 2026

గాలిలో బిల్‌గేట్స్ విమానం చక్కర్లు!

image

AP: బిల్‌గేట్స్ విమానం ల్యాండింగ్‌కు సమస్య తలెత్తింది. విజయవాడ విమానాశ్రయం వద్ద దట్టంగా పొగమంచు అలుముకోవడంతో ల్యాండింగ్ సాధ్యపడట్లేదు. దీంతో ఫ్లైట్ విజయవాడ చుట్టూ చక్కర్లు కొడుతోంది. సేఫ్ ల్యాండింగ్‌కు అనుకూల వాతావరణం కోసం పైలట్ ప్రయత్నిస్తున్నారు. ఇవాళ బిల్‌గేట్స్ అమరావతిని సందర్శించాల్సి ఉంది.

News February 16, 2026

కాకినాడ: మూడేళ్ల క్రితం తండ్రి మృతి.. ఇప్పుడు కూతురు సూసైడ్!

image

కాకినాడ JNTU హాస్టల్‌లో టెక్కలి మండలం పాలసింగి గ్రామానికి చెందిన ఏ.అరుణ(19) అనే ఇంజినీరింగ్ విద్యార్థిని ఆదివారం <<19152593>>ఆత్మహత్య <<>>చేసుకున్న విషయం తెలిసిందే. కాగా మృతురాలి తండ్రి రాము మూడేళ్ల క్రితం తిరుపతిలో భవన నిర్మాణ పనులు చేస్తూ ప్రమాదవశాత్తు జారిపడి మృతిచెందాడు. తాజాగా కుమార్తె ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. మృతురాలికి తల్లి సంధ్య(వ్యవసాయ కూలీ), సోదరుడు ఉన్నారు.