News April 26, 2024
మే 1వ తేదీన ఏలూరులో జగన్ పర్యటన

వైసీపీ అధినేత YS జగన్ మోహన్ రెడ్డి మే 1వ తేదీన ఏలూరులో నిర్వహించనున్న ఎన్నికల బహిరంగ సభలో పాల్గొంటారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు పర్యటన వివరాలను గురువారం విడుదల చేశారు. 1వ తేదీన (బుధవారం) మధ్యాహ్నం 3 గంటలకు సభలో పాల్గొంటారని పేర్కొన్నారు.
Similar News
News September 11, 2025
మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా దృష్టి: కలెక్టర్

స్వయం సహాయక సంఘాల మహిళలకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. భీమవరం కలెక్టరేట్లో బుధవారం ఉపాధి అంశంపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. గుర్రపు డెక్క నుంచి వర్మి కంపోస్ట్ రూపొందించడంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ప్రతి మండలంలో మూడు యూనిట్లు తప్పనిసరిగా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
News September 11, 2025
‘ఆక్వా జోనేషన్ విస్తీర్ణం నిర్ధారణపై తనిఖీ చేయాలి’

గ్రామ స్థాయిలో ఆక్వా జోనేషన్ విస్తీర్ణం నిర్ధారణపై మండల స్థాయి అధికారులు తనిఖీ చేసి వెంటనే నివేదికను అందజేయాలని కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ మండల స్థాయి కమిటీ అధికారులతో ఆక్వా జోనేషన్ ప్రతిపాదనలపై సమీక్షించారు. గ్రామ స్థాయి నుంచి ఆక్వా జోనేషన్ విస్తీర్ణాన్ని తనిఖీ చేసి జిల్లా స్థాయి కమిటికి పూర్తి స్థాయిలో నివేదిక అందించాలన్నారు.
News September 10, 2025
హెక్తాన్-25 విజేతలకు బహుమతుల ప్రదానం

ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి బుధవారం రాత్రి భీమవరంలో నిర్వహించిన అమరావతి క్వాంటం వ్యాలీ హెక్తాన్-25 సెమీఫైనల్స్‌లో విన్నర్స్, రన్నర్స్‌కు కలెక్టర్ నాగరాణి బహుమతులు అందించారు. విన్నర్స్‌గా భీమవరం, రాజమండ్రి, సూరంపాలెం, కాకినాడ కళాశాలలు దక్కించుకున్నాయి. రన్నర్స్‌గా తుని, రాజమండ్రి, భీమవరం, సూరంపాలెం, గైడ్ ఇంజినీరింగ్ కాలేజీ, రాజమండ్రి కళాశాల నిలిచాయి.