News April 29, 2024

మే 1-5 లోగా పింఛన్ల పంపిణీ పూర్తి: కలెక్టర్

image

మే 1వ తేదీ నుంచి 5వ తేదీలోగా పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని కలెక్టర్ ఎం.విజయ సునీత అధికారులను ఆదేశించారు. జిల్లాలో వృద్ధాప్య, వితంతు, వికలాంగ, తదితర ఫించనుదారులు 1,26,773 మంది, మెడికల్ ఫించన్లు పొందుతున్న వారు 1,121 మంది కలిపి 1,27,894 మందికి పంపిణీ చేయాల్సి ఉందన్నారు. గత నెలలో 99.18 శాతం ఫించన్లు పంపిణీ చేసి రాష్ట్రంలో 2వ స్థానంలో నిలిచామని, అదే స్ఫూర్తితో ఈనెల కూడా ఫించన్లు పంపిణీ చేయాలన్నారు.

Similar News

News October 1, 2024

స్టీల్ ప్లాంట్ సీఎండీగా బాధ్యతలు స్వీకరించిన సక్సేనా

image

విశాఖ స్టీల్ ప్లాంట్ సీఎండీగా ఏ.కే.సక్సేనా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. మాంగనీస్ ఓర్ ఇండియా లిమిటెడ్ సీఎండీగా పనిచేస్తున్న సక్సేనా స్టీల్ ప్లాంట్ సీఎండీగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్లాంట్ డైరెక్టర్లు, అధికారులతో ఆయన సమావేశం నిర్వహించి ప్రస్తుత పరిస్థితిని తెలుసుకున్నారు. తర్వాత కర్మాగారాన్ని సందర్శించారు.

News September 30, 2024

విశాఖ కానిస్టేబుల్ మిస్సింగ్ కేసులో ట్విస్ట్

image

ఎండాడ మహిళా పోలీసు స్టేషన్‌ కానిస్టేబుల్ కనకల వెంకట నరసింహమూర్తి ఈనెల 22న విధులకు వెళ్లారు. డ్యూటీ అనంతరం నరసింహమూర్తి ఇంటికి రాలేదు. అతని భార్య ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో స్టేషన్లో ఆరా తీసి మిస్సింగ్ కేసు పెట్టింది. అయితే ఆదివారం నరసింహమూర్తి ఇంటికి చేరుకున్నాడు. ఆ సంగతి తెలుసుకున్న SI వెళ్లి ఆరా తీయగా పనిఒత్తిడితో ప్రశాంతత కోసం తిరుపతి, విజయవాడ దైవ దర్శనానికి వెళ్లినట్లు అతను తెలిపాడు.

News September 30, 2024

విశాఖ: ‘ఓటుహక్కు నమోదుకు దరఖాస్తు చేసుకోవాలి’

image

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు అర్హులైన ఉపాధ్యాయులందరూ ఓటు హక్కు నమోదుకు దరఖాస్తు చేసుకోవాలని విశాఖ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. సోమవారం నోటిఫికేషన్ వెలువడిందన్నారు. ఓటు నమోదు ప్రక్రియ కూడా ప్రారంభమైందని నవంబర్ 6 వరకు కొనసాగుతుందన్నారు. నవంబర్ 23న డ్రాఫ్ట్ పబ్లిష్ అవుతుందన్నారు. 23 నుంచి డిసెంబర్ 9 వరకు అభ్యంతరాల స్వీకరణ, 30న తుది జాబితా ప్రకటిస్తామన్నారు. >Share it