News April 29, 2024
మే 13న సెలవు: కలెక్టర్

పార్లమెంటు, రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు పోలింగ్ జరిగే మే 13న జిల్లాలో స్థానిక సెలవుదినంగా ప్రకటిస్తున్నట్టు కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆరోజు ప్రైవేటు సంస్థల్లో పనిచేసే కార్మికులు తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు వీలుగా నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ చట్టం, 1881 ప్రకారం సెలవు ప్రకటించడం జరిగిందని పేర్కొన్నారు.
Similar News
News December 25, 2025
42 మందితో విజయనగరం టీడీపీ పార్లమెంటరీ వర్గం

విజయనగరం జిల్లా పార్లమెంటరీ కార్యవర్గాన్ని టీడీపీ ప్రకటించింన సంగతి తెలిసిందే. ఇందులో 42 మందికి స్థానం కల్పించింది. ఇందులో తొమ్మిది మంది చొప్పున ఉపాధ్యక్షులు, కార్యనిర్వాహక కార్యదర్శులు, అధికార ప్రతినిధులను, కార్యదర్శులకు అవకాశమిచ్చింది. మొత్తంగా 13 మంది మహిళలకు స్థానం లభించింది. కాగా నూతన కార్యవర్గంలో బీసీలకు సముచిత ప్రాధాన్యం ఇచ్చారని పార్టీ నేతలు ఆనందం వ్యక్తం చేశారు.
News December 25, 2025
డిజిటల్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: VZM SP

సైబర్, డిజిటల్ అరెస్ట్ పేరుతో జరుగుతున్న మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ దామోదర్ బుధవారం సూచించారు. వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ వివరాలు, ఓటీపీలు, పాస్‌వర్డులను ఎవరితోనూ పంచుకోవద్దని చెప్పారు. అనుమానాస్పద లింకులు, ఏపీకే ఫైల్స్, క్యూఆర్ కోడ్స్ ఓపెన్ చేయవద్దన్నారు. నకిలీ కాల్స్ చేసి సీబీఐ, ఈడీ, సీఐడీ అధికారులమంటూ బెదిరించే వారిని నమ్మవద్దు అన్నారు.