News March 29, 2025
మే 23 నుంచి వారం పాటు 30 రైళ్లు రద్దు

సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని మహబూబాబాద్ స్టేషన్‌లో నాన్ ఇంటర్ లాకింగ్ పనులు చేపడుతున్నందున మే 23 నుంచి 29 వరకు సుమారు 30 రైళ్లను రద్దు చేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. వీటితో పాటు మరో ఆరు రైళ్లను పాక్షికంగా రద్దు చేయగా, 11 రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు CPRO శ్రీధర్ తెలిపారు. అలాగే 35 రైళ్లకు ఆయా తేదీల్లో మహబూబాబాద్ స్టేషన్లో స్టాపేజీని ఎత్తివేశామని వెల్లడించారు.
Similar News
News April 1, 2025
మైనారిటీ గురుకుల పాఠశాలను సందర్శించిన వరంగల్ కలెక్టర్

నర్సంపేటలోని ద్వారకా పేటలో ఉన్న మైనారిటీ గురుకుల పాఠశాల(బాలికలు)ను కలెక్టర్ సత్యశారద సోమవారం సందర్శించారు. పదవతరగతి విద్యార్థులతో ముచ్చటించారు. పదవతరగతి విద్యార్థినులకు బంగారు భవిష్యత్‌కి టర్నింగ్ పాయింట్ అని విద్యార్థులకు సూచించారు. అనంతరం స్టోర్ రూమ్, కిచెన్ రూమ్‌ను సందర్శించి పరిశుభ్రంగా ఉండేలా చూడాలని వార్డెన్‌ను కలెక్టర్ ఆదేశించారు.
News March 31, 2025
హన్మకొండ: GREAT.. గ్రూప్-1 అధికారిగా ఎంపికైన సోని

హనుమకొండ టైలర్స్ స్ట్రీట్‌కు చెందిన తోట దామోదర్-జ్యోతిల కుమార్తె తోట సోని గ్రూప్-1 అధికారిగా ఎంపికైంది. రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ప్రకటించిన గ్రూప్-1 జనరల్ ర్యాంకుల జాబితాలో తోట సోనికి రాష్ట్ర స్థాయిలో 203వ ర్యాంకు, మల్టీ జోన్ స్థాయిలో 93వ ర్యాంకు సాధించింది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈ ర్యాంకు సాధించానని తోట సోని తెలిపారు.
News March 31, 2025
వరంగల్: జాతరలో యువకుల మధ్య ఘర్షణ.. ఒకరి మృతి

వరంగల్ జిల్లా సంగెం మండలం గవిచర్ల గ్రామంలో నిర్వహించిన గుండా బ్రహ్మయ్య జాతరలో యువకుల మధ్య ఘర్షణ ఏర్పడింది. ఈ ఘటనలో కుంతపల్లి గ్రామానికి చెందిన బన్నీ అనే యువకుడు తీవ్రంగా గాయపడి మృతి చెందారు. సంగెం పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘర్షణలో పాల్గొన్న యువకుల వివరాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.