News April 21, 2024

మే 26 నుంచి అంబేద్కర్ ఓపెన్ డిగ్రీ పరీక్షలు

image

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ ప్రధమ సంవత్సరం మొదటి సెమిస్టర్ పరీక్షలు మే 26 నుంచి జూన్ 1 వరకు నిర్వహించనున్నట్లు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ లెర్నింగ్ సపోర్ట్ సెంటర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నల్గొండ కో-ఆర్డినేటర్ డా.సుంకరి రాజారామ్ తెలిపారు. ప్రధమ సెమిస్టర్ ఎగ్జామినేషన్ ఫీజు మే 6 వరకు చెల్లించాలన్నారు. పూర్తి వివరాలకు 7382929758, 9553568049 నంబర్లను సంప్రదించాలన్నారు.

Similar News

News September 11, 2025

గర్భిణీ స్త్రీల వైద్య సేవల పట్ల నిర్లక్ష్యం వద్దు: ఇలా త్రిపాఠి

image

గర్భిణీ స్త్రీల వైద్య సేవల పట్ల వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వహించవద్దని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. గురువారం ఆమె నల్గొండ మండలం రాములబండ ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె హై రిస్క్ ఏఎన్‌సీ కేసులు, కుక్క కాటుకు యాంటీ రేబిస్ వ్యాక్సినేషన్, ఈడీడీ క్యాలెండర్, ఆసుపత్రిలో మందుల లభ్యత, మలేరియా, డెంగ్యూ పరీక్షల నిర్వహణ వంటి అంశాలను పరిశీలించారు.

News September 11, 2025

అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు: ఏఎస్‌పీ మౌనిక

image

ఏప్రిల్‌లో దేవరకొండలోని హనుమాన్ నగర్‌లో జరిగిన దొంగతనం కేసులో నిందితుడు పిట్ట గంగాధరను అరెస్టు చేసినట్లు ఏఎస్‌పీ మౌనిక తెలిపారు. నిందితుడి వద్ద నుంచి రూ.2.5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ దొంగతనంలో రూ. 6 లక్షల నగదు, 2.2 తులాల బంగారం చోరీకి గురయ్యాయని.. నిందితుడిపై సుమారు 100కు పైగా దొంగతనం కేసులు ఉన్నట్లు ఏఎస్‌పీ తెలిపారు.

News September 11, 2025

NLG: మద్యం టెండర్లకు కసరత్తు

image

జిల్లాలోని మద్యం దుకాణాల లైసెన్సుల గడువు ముగియనున్న నేపథ్యంలో, ఆబ్కారీ శాఖ కొత్త టెండర్ల నిర్వహణకు సిద్ధమవుతోంది. 2025-27 సంవత్సరాలకు సంబంధించి, అక్టోబర్‌లోనే టెండర్లు నిర్వహించాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలిసింది. డిసెంబర్ 1 నుంచి కొత్త ఎక్సైజ్ పాలసీ అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని మొత్తం 155 మద్యం దుకాణాలకు టెండర్లు వేగవంతం చేయాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు.