News March 20, 2024

మైదుకూరులో భారీగా గంజాయి స్వాధీనం

image

మైదుకూరు అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మైదుకూరు డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల మేరకు.. మైదుకూరు పట్టణంలోని వీణ విజయ వీధిలో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారంతో వెళ్లి దాడులు నిర్వహించామన్నారు. ఈ దాడుల్లో నలుగురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 12.100 కేజీల గంజాయి, బైక్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News September 26, 2025

28 నుంచి IIIT విద్యార్థులకు దసరా సెలవులు

image

ఇడుపులపాయలోని IIIT విద్యార్థులకు ఈనెల 28 నుంచి అక్టోబర్ 5 వరకు దసరా సెలవులు ప్రకటించారు. అన్ని క్యాంపస్ విద్యార్థులకు ఈ తేదీల్లోనే సెలవులు ఉంటాయి. స్వగ్రామాలకు వెళ్లడానికి విద్యార్థులు ఈ మేరకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

News September 26, 2025

కడప మేయర్ తొలగింపు.. MLAకు నోటీసులు

image

కడప మేయర్ సురేశ్ బాబును తొలగిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీనిని సవాల్ చేస్తూ ఆయన హైకోర్టుకు వెళ్లారు. వాదనలు విన్న న్యాయస్థానం ఈ పిటిషన్‌పై కౌంటర్ వేయాలని ప్రతివాదిగా ఉన్న MLA రెడ్డప్ప మాధవి రెడ్డికి నోటీసులు జారీ చేసింది. అలాగే మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కడప కార్పొరేషన్ కమిషనర్, రీజినల్ విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారికి నోటీసులు ఇచ్చింది. విచారణ అక్టోబర్ 7కు వాయిదా వేసింది.

News September 26, 2025

పోలీసులపై ప్రొద్దుటూరు ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

image

పోలీసులపై ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి అసెంబ్లీ సాక్షిగా గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులే దందాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉందన్నారు. వారిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని.. వాళ్లు పోలీసులకే సహకారం అందిస్తున్నారని విమర్శించారు. పోలీసుల మీద పోలీసులే విచారిస్తే న్యాయం జరగదన్నారు.