News May 14, 2024
మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డిపై కేసు

మైదుకూరు వైసీపీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డిపై కేసు నమోదైంది. ఎమ్మెల్యేతో సహా 11 మంది అనుచరులపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. సోమవారం పోలింగ్ సందర్భంగా చాపాడు మండలం చిన్నగులవలురులో ఇద్దరు టీడీపీ ఏజెంట్లపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. దీంతో ఇద్దరు టీడీపీ ఏజెంట్లు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే రఘురామిరెడ్డితో సహా 11 మందిపై చాపాడు పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News September 10, 2025
కడప మేయర్ సురేశ్ బాబుకు మరోసారి నోటీసులు

కడప నగరపాలక సంస్థ మేయర్ సురేశ్ బాబుకు మరోసారి నోటీసులు జారీ అయ్యాయి. ఈ నెల 17న హాజరుకావాలని ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేశ్ కుమార్ నోటీసులు పంపారు. ఇదే చివరి అవకాశం అంటూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తమ కుటుంబ సభ్యులకు చెందిన సంస్థలకు కాంట్రాక్ట్ పనులు మంజూరు చేసినట్లు వచ్చిన ఆరోపణల కారణంగా కోర్టు నోటీసులు జారీ చేసింది.
News September 10, 2025
కడప: బాలికపై అత్యాచారయత్నం.. నిందితుడి అరెస్ట్

కడప తాలూకా స్టేషన్ పరిధిలో బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడిన నిందితుడు రాజ్ కుమార్‌పై పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ రెడ్డప్ప, SI తులసినాగ ప్రసాద్ తెలిపారు. భగత్ సింగ్ నగర్‌కు చెందిన రాజ్ కుమార్ అనే రౌడీషీటర్ అయిదేళ్ల చిన్నారిపై ఈనెల 7వ తేదీన అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు గుర్తించి అతన్ని పట్టుకుని దేహశుద్ధిచేసి పోలీసులకు అప్పగించారు. దీంతో అతనిపై పోక్సో కేసు నమోదు చేశారు.
News September 10, 2025
వారం రోజుల్లో 50 వేల టన్నుల యూరియా రానుంది: కలెక్టర్ శ్రీధర్

వారం రోజుల్లో 50 వేల టన్నుల యూరియా అందుబాటులోకి రానుందని కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. మంగళవారం యూరియా డిమాండ్, నిల్వలు, సరఫరాపై జేసీ అదితి సింగ్, ఎస్పీ అశోక్ కుమార్‌లతో కలిసి కలెక్టర్ సమీక్షించారు. ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ఇప్పటికే 12,800 మెట్రిక్ టన్నుల యూరియాను ఆయా ప్రాంతాల రైతు సేవా కేంద్రాలు, సంబంధిత డీలర్ల ద్వారా అందించామన్నారు. సరిపడా యూరియాను అందించేందుకు సిద్ధం చేశామన్నారు.