News October 1, 2024

మైదుకూరు వద్ద రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి

image

కడప జిల్లా మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని శ్రీనగరం గ్రామం వద్ద సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. నంద్యాల రోడ్డులోని 49వ జాతీయ రహదారిపై కారు స్కూటర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో మైదుకూరు పట్టణానికి చెందిన కంచర్ల రుద్రదీపు(23) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మైదుకూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మరింత సమాచారం తెలియాల్సిఉంది.

Similar News

News January 20, 2025

కడప జిల్లా డీఈవోగా షంషుద్దీన్

image

కడప జిల్లా నూతన జిల్లా విద్యాశాఖ అధికారిగా కర్నూలు జిల్లా తాండ్రపాడు డైట్ సీనియర్ లెక్చరర్ ఎస్. షంషుద్దీన్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు జిల్లా విద్యాశాఖ అధికారిగా వ్యవహరించిన మీనాక్షిపై ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు ఆరోపణలు, ఉద్యమాలు చేసిన నేపథ్యంలో ఆమె స్థానంలో ఈయనను పాఠశాల విద్య ప్రభుత్వ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు.

News January 20, 2025

కడప: క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో ఏఈ మృతి

image

కడప ఇరిగేషన్ శాఖలో ఏఈగా పనిచేస్తున్న నాగరాజు(42) ఆదివారం గుండెపోటుతో మృతి చెందారు. KSRM ఇంజినీరింగ్ కాలేజీలో క్రికెట్ ఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలాడు. తోటి ఆటగాళ్లు ఆయన్ను హుటాహుటిన కడపలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈయనకు త్వరలో డీఈగా ప్రమోషన్ రానున్నట్లు తెలిసింది. దీంతో ఆయన కుటుంబీకులు శోకసంద్రంలో మిగిలారు.

News January 20, 2025

కడప: నేడు యథావిధిగా కార్యక్రమం

image

ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహించే కార్యక్రమాన్ని యథావిధిగా నేడు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. గ్రామ మండల స్థాయిలో పరిష్కారం కానీ సమస్యలు ఏవైనా ఉంటే ప్రజలు నేరుగా కడప కలెక్టరేట్లో రేపు ఉదయం 10:30 గంటల నుంచి అధికారుల దృష్టికి తీసుకుని రావచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు.