News May 31, 2024

మైనర్లు వాహనం నడిపితే రూ.25వేల ఫైన్: రాజాం CI 

image

నిబంధనలు పాటించకుంటే ‘భరత్ అనే నేను’ మూవీలో ఫైన్స్ ఎంత కఠినంగా ఉన్నాయో మనం చూశాం. ఇకపై మన శ్రీకాకుళంలోనూ అదే జరగనుంది. జూన్ 1 నుంచి కొత్త నిబంధనలు అమలులోకి వస్తున్నట్లు రాజాం CI మోహన్ రావు తెలిపారు. ఓవర్ స్పీడ్‌తో పట్టుబడితే రూ.1000-రూ.2000, లైసెన్స్ లేకుండా డ్రైవింగ్-రూ.500, మైనర్లు వాహనం నడిపితే రూ.25వేల ఫైన్‌తో పాటు మైనర్‌కు 25 ఏళ్ల వయసు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ పొందే ఛాన్స్ ఉండదన్నారు.

Similar News

News November 26, 2024

పలాస: ఉరేసుకుని జవాన్ భార్య ఆత్మహత్య

image

పలాస మండలం ఈదురాపల్లిలో మీరజాక్షి (21) అనే మహిళ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మెళియాపుట్టి(M) టకోయిగాతలవలస గ్రామానికి చెందిన మీరజాక్షికి 7 నెలల క్రితం ఈదురాపల్లి చెందిన జవాన్ వినోద్‌తో వివాహమైంది. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా వారం క్రితం ఇదే గ్రామంలో కుటుంబ కలహాలతో ఓ జవాన్ భార్య సూసైడ్ చేసుకున్నారు.

News November 26, 2024

త్రిపురాన విజయ్ నేపథ్యం ఇదే..!

image

శ్రీకాకుళం జిల్లా యువకుడు IPLకు ఎంపికైన విషయం తెలిసిందే. టెక్కలికి చెందిన త్రిపురాన వెంకటకృష్ణరాజు, లావణ్య దంపతుల కుమారుడు విజయ్‌కు మొదటి నుంచి క్రికెట్ ఆసక్తి. ఈక్రమంలో పలు పోటీల్లో సత్తాచాటాడు. సోమవారం జరిగిన ఐపీఎల్ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ అతడిని రూ.30లక్షల బేస్ ప్రెస్‌‌కు దక్కించుకుంది. విజయ్ తండ్రి వెంకటకృష్ణరాజు సమాచారశాఖ ఉద్యోగి, తల్లి లావణ్య గృహిణి. విజయ్‌కు పలువురు అభినందనలు తెలిపారు.

News November 26, 2024

మందస: ముగిసిన యుటీఎఫ్ స్వర్ణోత్సవ మహాసభలు

image

సామాజిక అంతరాలను రూపుమాపేదే విద్య అని యుటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.వెంకటేశ్వర్లు అన్నారు. మందస మండలం హరిపురంలో యూటీఎఫ్ స్వర్ణోత్సవ మహాసభలు సోమవారంతో ముగిశాయి. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసమే కాకుండా, ప్రజలకు ఇబ్బంది వచ్చిన ప్రతి సందర్భంలోనూ వారిని ఆదుకోవడానికి యుటీఎఫ్ కార్యకర్తలు పని చేస్తారని తెలిపారు. అనంతరం నూతన కమిటీ ఎన్నికలు నిర్వహించారు. పలు తీర్మానాలు ప్రవేశపెట్టారు.