News September 22, 2024

మైనర్లు వాహనాలు నడిపితే చర్యలు: గుంటూరు ఎస్పీ

image

నగరంలోని పాఠశాలలు, కళాశాల యాజమాన్యాలతో శనివారం జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ సమావేశం నిర్వహించారు. ట్రాఫిక్ సమస్య, మైనర్లు డ్రైవింగ్ నడపడం తదితర అంశాలపై విద్యాసంస్థల ప్రతినిధులు ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. స్పందించిన ఎస్పీ మైనర్లు వాహనాలు నడిపితే తల్లితండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. విద్యాసంస్థల వద్ద పోలీసు భద్రత పెంచుతామని సూచించారు.

Similar News

News September 21, 2024

సంక్షోభంలో గుంటూరు వైసీపీ

image

గుంటూరు అర్బన్‌లో వైసీపీ సంక్షోభంలో పడింది. ఎన్నికల సమయంలో పలువురు కార్పొరేటర్లు టీడీపీలో చేరగా తాజాగా పార్టీకి మరో నలుగురు కార్పొరేటర్లు రాజీనామా చేశారు. 8వ డివిజన్ కార్పొరేటర్ ధనలక్ష్మి, 13వ డివిజన్ కార్పొరేటర్ సంకురి శ్రీను, 18వ డివిజన్ కార్పొరేటర్ వెంకట రమణ, 56వ డివిజన్ కార్పొరేటర్ కనకదుర్గ తమ రాజీనామా లేఖలను వైసీపీ అధినేత జగన్‌కు పంపారు.

News September 21, 2024

ప్రభుత్వంతో నేరుగా చర్చలు: మంత్రి లోకేశ్

image

పెట్టుబడుదారులు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై నేరుగా ప్రభుత్వంతో చర్చించేందుకు కన్సల్టేటివ్ ఫోరం ఏర్పాటుచేయనున్నట్లు మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. శనివారం విజయవాడలో నిర్వహించిన సీఐఐ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. లోకేశ్ మాట్లాడుతూ.. కన్సల్టేటివ్ ఫోరం ఏర్పాటుపై వారం రోజుల్లో జీవో ఇస్తామన్నారు. రాష్ట్రాభివృద్ధిలో సీఐఐ కీలకపాత్ర పోషించాలని మంత్రి పారిశ్రామికవేత్తలను కోరారు.

News September 21, 2024

నేడు టీడీపీ కార్యాలయానికి సీఎం చంద్రబాబు

image

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఎం చంద్రబాబు శనివారం రానున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రజలు తమ వినతి పత్రాలను అందించే వెసులుబాటును వినియోగించుకోవాలని కోరారు. పార్టీ కార్యాలయానికి చంద్రబాబు వస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ శ్రేణులు, ప్రజలు అర్జీలు ఇచ్చేందుకు వచ్చే అవకాశం ఉంది.