News February 23, 2026
మైనర్, డ్రంకెన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు: జగిత్యాల ఎస్పీ

జగిత్యాల జిల్లాలో రోడ్డు భద్రతకు పోలీసు శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. మైనర్, డ్రంకెన్ డ్రైవ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి యాదృచ్ఛిక తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి అవసరమైతే లైసెన్సులు రద్దు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. హెల్మెట్ ధారణపై కఠిన అమలు చేస్తున్నామని అన్నారు.
Similar News
News February 24, 2026
‘సాగునీటి’ ఎన్నికల్లోనూ ‘ఇద్దరు పిల్లల’ నిబంధన ఎత్తివేత

AP: స్థానిక ఎన్నికల తరహాలోనే సాగునీటి సంఘాల ఎన్నికల్లోనూ ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్నా పోటీ చేసేలా ప్రభుత్వం చట్ట సవరణ చేసింది. దీనికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ‘1980-90లో జనాభా పెరిగిన కారణంగా ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపట్టాయి. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో సంతానోత్పత్తి పడిపోయింది. భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని ఇద్దరు పిల్లల నిబంధన తొలగిస్తున్నాం’ అని మంత్రి రామానాయుడు తెలిపారు.
News February 24, 2026
కల్తీ నెయ్యిపై నేడు అసెంబ్లీలో చర్చ

AP: తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీలో చర్చించనుంది. ఉ.10.30 నుంచి మ.2 గంటల వరకు టీడీపీ, బీజేపీ, జనసేనకు చెందిన 10 మంది సభ్యులు ఈ అంశంపై మాట్లాడనున్నారు. గొంతునొప్పి కారణంగా నిన్న సభకు హాజరుకాని డిప్యూటీ సీఎం పవన్ కూడా నేడు సభలో ప్రసంగించే అవకాశం ఉంది. మ.12.30 నుంచి సీఎం చంద్రబాబు మాట్లాడి చివరలో ఓ ప్రకటన విడుదల చేస్తారు.
News February 24, 2026
నువ్వుల పంటలో రసం పీల్చే పురుగులు – నివారణ

నువ్వుల పంటను పేనుబంక, పచ్చదోమ, తెల్లనల్లి, తామర పురుగులు ఆశించి ఆకుల అడుగుభాగాన చేరి రసం పీలుస్తాయి. ఫలితంగా ఆకులు వాలిపోయి తర్వాత దశలో ఎండిపోతాయి. పేనుబంక, తామరపురుగు, పచ్చదోమ నివారణకు KG విత్తనానికి 5గ్రా. ఇమిడాక్లోఫ్రిడ్‌తో విత్తనశుద్ధి చేయాలి. లీటరు నీటికి డైమిథోయేట్ 1.6ml లేదా ఎసిఫేట్ 1.5గ్రా. కలిపి పిచికారీ చేయాలి. తెల్లనల్లి నివారణకు లీటరు నీటికి డైకోఫాల్ 5ml కలిపి పిచికారీ చేయాలి.


