News December 20, 2025

మైనర్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు: ASF SP

image

ట్రిపుల్ రైడింగ్, రాష్ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్‌పై పోలీసులు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని, మైనర్లు డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే కేసు నమోదు చేస్తామని ASF జిల్లా SP నితికా పంత్ తెలిపారు. వాహన యజమానులు మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని, ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. ట్రాఫిక్ రూల్స్ తప్పక పాటించాలని సూచించారు.

Similar News

News December 23, 2025

తల్లి అయిన తర్వాత నా బాడీపై గౌరవం పెరిగింది: కియారా

image

హీరోయిన్ కియారా అద్వానీ రీసెంట్‌గా తన బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ గురించి మనసు విప్పారు. 2025 జులైలో పాప పుట్టిన తర్వాత, తన శరీరాన్ని చూసే కోణం మారిందని చెప్పారు. ‘వార్ 2’ సినిమాలో బికినీ సీన్ కోసం చాలా కష్టపడ్డానని, అప్పట్లో పర్ఫెక్ట్ ఫిగర్ కోసం తాపత్రయపడ్డానని గుర్తు చేసుకున్నారు. కానీ ఒక ప్రాణానికి జన్మనిచ్చిన తన శరీరం పట్ల చాలా గౌరవం పెరిగిందని, సైజ్ ముఖ్యం కాదని గుర్తించానని తెలిపారు.

News December 23, 2025

జగిత్యాల: ప్రభుత్వం ఆధ్వర్యంలో మొబైల్ ఎక్స్‌రే సేవలు

image

మొబైల్ ఎక్స్‌రే మిషన్ ద్వారా క్షయ వ్యాధి గుర్తింపు సులభమవుతుందని జిల్లా వైద్యాధికారి ఆకుల శ్రీనివాస్ తెలిపారు. టీబీ ముక్త భారత్ అభియాన్‌లో భాగంగా జగిత్యాల ఖిలాగడ్డ అర్బన్ ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేక టీబీ క్యాంపు నిర్వహించారు. మొబైల్ ఎక్స్‌రే ద్వారా అక్కడికక్కడే పరీక్షలు చేసి బాధితులను గుర్తించి మందులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ఉపవైద్యాధికారి డాక్టర్ ఎన్. శ్రీనివాస్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

News December 23, 2025

జనవరి నుంచి రేషన్ డిపోలో గోధుమపిండి: విశాఖ జేసీ

image

విశాఖలో అన్ని రేషన్ డిపోలలో జనవరి నెల నుంచి గోధుమపిండి పంపిణీ చేయనున్నట్లు జేసీ మయూర్ అశోక్ మంగళవారం తెలిపారు. బియ్యం, పంచదార, రాగులతో పాటు గోధుమపిండి ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. కేజీ గోధుమపిండి రూ.20కి ఇవ్వనున్నట్టు ప్రకటించారు. తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.