News October 10, 2025

మైనారిటీ గురుకులాల్లో ఔట్‌సోర్సింగ్‌ పోస్టుల భర్తీ

image

ఖమ్మం జిల్లాలోని మైనారిటీ గురుకుల పాఠశాల, కళాశాలల్లో ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి ఎండీ ముజాహీద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాల కోసం ఖమ్మం కలెక్టరేట్‌లోని తమ కార్యాలయంలో సంప్రదించాలని ఆయన సూచించారు.

Similar News

News October 10, 2025

KMM: రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి: కలెక్టర్

image

ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో వైద్య ఆరోగ్యశాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. పీహెచ్‌సీలలో పనిచేసే ప్రతి సిబ్బంది అటెండెన్స్‌ను ఆన్‌లైన్ చేసి, 100% మానిటరింగ్ చేయాలన్నారు. ప్రతి వైద్యాధికారి తన పరిధిలోని ఆశా కార్యకర్తలతో తప్పనిసరిగా సమావేశాలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.

News October 10, 2025

ఖమ్మం: బావిలో జారిపడి మహిళ మృతి

image

ప్రమాదవశాత్తు బావిలో పడి ఓ మహిళ మృతి చెందిన ఘటన తిరుమలాయపాలెం మండలంలో చోటుచేసుకుంది. పిండిప్రోలు గ్రామానికి చెందిన కాంపాటి ఆశాకుమారి(45) పశువుల మేతకోసం చేను వద్దకు వెళ్లి గడ్డి కోస్తుండగా ప్రమాదవశాత్తు బావిలో జారి పడడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు.

News October 9, 2025

ఈ నెల 23లోగా అభ్యంతరాలు తెలపాలి: ఖమ్మం కలెక్టర్

image

ఖమ్మం జిల్లాలో మాన్యువల్ స్కావెంజర్స్‌పై ప్రజలు తమ అభ్యంతరాలను ఈ నెల 23వ తేదీలోపు తెలియజేయాలని కలెక్టర్ అనుదీప్ కోరారు. మాన్యువల్ స్కావెంజర్స్ రిహాబిలిటేషన్ చట్టం-2013 ప్రకారం సర్వే కమిటీలు ఏర్పాటు చేయగా, జిల్లాలో స్కావెంజర్లను గుర్తించలేదని కలెక్టర్ తెలిపారు. ఎవరికైనా అభ్యంతరాలు లేదా సమాచారం ఉంటే కలెక్టరేట్‌లోని షెడ్యూల్ కులాల అభివృద్ధి (SC Development) కార్యాలయంలో అందజేయాలని ఆయన సూచించారు.