News March 1, 2026

మైనారిటీ పథకాలలో ములుగు జిల్లాకు మొండిచేయి!

image

మైనార్టీల ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాల్లో ములుగు జిల్లాకు మొండిచేయి చూపుతోంది. తాజాగా 90% రాయితీపై ఎలక్ట్రికల్ స్కూటర్లు, టూల్ కిట్లు, జనరేటర్లను అందించేందుకు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆన్‌లైన్‌లో దరఖాస్తులు తీసుకుంది. ఈరోజుతో గడువు ముగిసింది. అయితే, ఆన్‌లైన్ పోర్టల్‌లో ములుగు సహా మొత్తం 8 జిల్లాల పేర్లు లేవు. దీంతో లబ్ధిదారులు ఈ పథకాలకు దూరమయ్యారు.

Similar News

News March 1, 2026

అనకాపల్లి: బాణసంచా తయారీ కేంద్రాలపై విస్తృతంగా తనిఖీలు

image

అనకాపల్లి జిల్లాలో బాణసంచా తయారీ కేంద్రాలపై విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ తుహీన్ సిన్హా తెలిపారు. కాకినాడ జిల్లా వేట్లపాలెంలో ఘటన జరిగిన నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం ముందస్తు తనిఖీలు చేపట్టిందన్నారు. నర్సీపట్నం, పరవాడ డీఎస్పీల ఆధ్వర్యంలో రెవెన్యూ, ఫైర్, పోలీస్ శాఖలు సంయుక్తంగా అనధికారంగా నిర్వహిస్తున్న కేంద్రాలపై దాడులు చేసినట్లు పేర్కొన్నారు.

News March 1, 2026

సమయం మారి… సమాచారం లీకై..!

image

ఇరాన్ సుప్రీం ఖమేనీపై US నెలల తరబడి నిఘా పెట్టి దాడిచేసింది. US నిఘా సంస్థ CIA ఇజ్రాయెల్‌తో కలిసి ఖమేనీ కదలికలపై కొన్ని నెలలుగా దృష్టి పెట్టింది. పాలనా భవనాల్లో శుక్రవారం సాయంత్రం ఖమేనీ, ఇతరులు భేటీ కాబోతున్నట్లు గుర్తించినా ఏ భవనంలో అన్నది స్పష్టం కాలేదు. అయితే సమావేశాన్ని నిన్న ఉదయానికి మార్చడంతో అది లీకైంది. ఏ టైమ్, ఎక్కడ అన్న కచ్చితమైన సమాచారంతో దాడిచేసినట్లు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.

News March 1, 2026

రెండో రోజు సెలబ్రిటీ క్రికెట్ పోటీలు ప్రారంభించిన గంటా

image

మధురవాడ ఏసీఏ – వీడీసీఏ స్టేడియంలో తెలుగు సెలబ్రిటీ క్రికెట్ లీగ్ రెండో రోజు పోటీలను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆదివారం ప్రారంభించారు. బలమైన జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ అందరికీ ఆనందాన్ని పంచుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ రోజుతో ముగుస్తున్న సెలబ్రిటీ క్రికెట్ విశాఖ ప్రజలకు మంచి అనుభూతిని అందించిందన్నారు. టాస్ వేసి పోటీలను ఆరంభించారు.