News February 25, 2026

మైనార్టీ వెబ్‌సైట్‌లో ‘నిర్మల్’ మాయం.. దరఖాస్తుదారుల ఆందోళన

image

మైనార్టీలకు సబ్సిడీ ద్విచక్ర వాహనాల పంపిణీకి ప్రభుత్వం దరఖాస్తులు కోరగా సంబంధిత OBMMS వెబ్‌సైట్‌లో నిర్మల్ జిల్లా పేరు కనిపించకపోవడం గందరగోళానికి దారితీస్తోంది. మార్చి 1 వరకు గడువు ఉన్నప్పటికీ, జిల్లా ఆప్షన్ లేక దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖను వివరణ కోరగా వెబ్‌సైట్‌లోనే సాంకేతిక లోపం ఉందన్నారు. వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

Similar News

News February 27, 2026

చరిత్రలో ఈరోజు (ఫిబ్రవరి 27)

image

1931: స్వాతంత్ర్య సమరయోధుడు చంద్రశేఖర్ ఆజాద్ మరణం(ఫొటోలో)
1932: ఆంగ్లో-అమెరికన్ నటి ఎలిజబెత్ టేలర్ జననం
1932: కవి, ఆర్థిక, వైద్య శాస్త్ర నిపుణుడు వేగె నాగేశ్వరరావు జననం
1956: లోక్‌సభ తొలి స్పీకర్ జి.వి.మావలంకర్ మరణం
1972: సినీ నటుడు శివాజీ రాజా పుట్టినరోజు
2002: సబర్మతి ఎక్స్‌ప్రెస్ దహనం, 59 మంది VHP కరసేవకులు మృతి

News February 27, 2026

108 రన్స్ తేడాతో గెలిస్తే సీన్ వేరేలా ఉండేది

image

T20 WC: భారత్ 72 పరుగుల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసినా వెస్టిండీస్ నెట్ రన్ రేట్‌ను మాత్రం దాటలేకపోయింది. ఇండియా 256 రన్స్ చేసినప్పటికీ విండీస్‌ను దాటాలంటే జింబాబ్వేను 148 లోపే కట్టడి చేయాల్సింది. అంటే కనీసం 108 పరుగుల తేడాతో గెలవాల్సింది. దీంతో మార్చి 1న విండీస్‌తో జరిగే మ్యాచ్ వర్షం వల్ల రద్దయితే రన్ రేట్ తక్కువగా ఉన్న టీమ్‌ఇండియా ఇంటికి వచ్చేస్తుంది.

News February 27, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.