News July 24, 2024
మైలవరం: నలుగిరి ప్రాణాలను కాపాడిన పోలీస్ సిబ్బంది

మైలవరం మండలం దొమ్మర నంద్యాల గ్రామానికి చెందిన గర్భవతి అంజనమ్మ, ఇద్దరు పిల్లలతో పాటు మంగళవారం రాత్రి 8గం. మైలవరం డ్యామ్ 13వ గేటు వద్ద ఆత్మహత్యకు ప్రయత్నించింది. పోలీసులకు అందిన సమాచారం మేరకు వెంటనే ఎస్సై, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాధితురాలిని స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా ఇంట్లో సమస్యలే కారణమని అందువల్లే ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసుల విచారణలో అంజనమ్మ తెలిపింది.
Similar News
News November 10, 2025
కడప శ్రీ చైతన్యలో విద్యార్థిని ఆత్మహత్య

కడప శ్రీ చైతన్య బాలికల రెసిడెన్షియల్ స్కూల్లో తొమ్మిదో తరగతి బాలిక జస్వంతి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విద్యార్థిని పులివెందుల వాసిగా సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News November 10, 2025
ఎర్రగుంట్లలోని ఆలయంలో హీరో సుమన్ సందడి

ఎర్రగుంట్ల (M) కలమల్ల గ్రామంలోని చెన్నకేశవ స్వామి ఆలయంలో సినీ హీరో సుమన్ సందడి చేశారు. అక్కడ ఉన్న పురాతన తొలి తెలుగు శాసనాన్ని పరిశీలించారు. తెలుగు శాసనాన్ని కట్టుదిట్టంగా ఏర్పాటు చేయడానికి తనవంతు కృషి చేస్తానన్నారు. ఆయన వెంట ఆలయాధికారులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.
News November 10, 2025
మైదుకూరు: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

మైదుకూరు మండలం జీవి సత్రం హైవే రోడ్డ పైన గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందారు. ఇద్దరు యువకులు కడపకు చెందిన సంజయ్, సంతోశ్ అని స్థానికులు గుర్తించారు. మృత దేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


