News August 24, 2025
మైలవరం: 33 ఏళ్ల లీజుకు 1200 ఎకరాలు

కడప జిల్లా మైలవరం మండలంలో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ మేరకు 1200 ఎకరాలను లీజు ప్రాతిపదికను కేటాయిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. దొడియంలో 1105.69 ఎకరాలు, వద్దిరాలలో 94.36 ఎకరాల ప్రభుత్వ భూములను 33 ఏళ్ల లీజుకు ఇచ్చింది. సోలార్ పరిశ్రమతో ఉద్యోగాలు వస్తాయని స్థానికులు ఆశగా ఎదురు చూస్తున్నారు.
Similar News
News August 24, 2025
కడప: భార్యాభర్తకు టీచర్ ఉద్యోగాలు

DSCలో కడప జిల్లా కాశినాయన మండలం రెడ్డికొట్టాలకు చెందిన దంపతులు సత్తాచాటారు. అంబవరం శేఖర్ 10వ ర్యాంకుతో ప్రిన్సిపల్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. ఆయన భార్య తేజస్వి SGTలో 317వ ర్యాంకు సాధించారు. శేఖర్ ప్రస్తుతం అన్నమయ్య జిల్లా గ్యారంపల్లి APRJCలో జూనియర్ లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. ఒకేసారి భార్యాభర్తకు ఉద్యోగాలు రావడంతో ఆ కుటుంబంలో సంతోషం అంబారన్ని అంటింది.
News August 24, 2025
కడప: అక్కాచెల్లెళ్లకు టీచర్ పోస్ట్‌లు

పోరుమామిళ్ల మండలం రంగసముద్రం పంచాయతీ మహబూబ్ నగర్‌కు చెందిన టీచర్ ఖాదర్ బాషా కుమార్తెలు DSCలో సత్తా చాటారు. ఎస్.మెహతాబ్(SGT)లో 2వ ర్యాంకు సాధించింది. S.రేష్మ 4 స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ఎంపికైంది. మొహతాబ్ 2వ ర్యాంకుతో పాటు 5 ఉద్యోగాలు సాధించడం, అక్కాచెల్లెళ్లు ఇద్దరికీ టీచర్ ఉద్యోగాలు రావడంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
News August 23, 2025
కడప: ఫలితాలు విడుదల

YVU డిగ్రీ ఇన్‌స్టంట్ పరీక్షల ఫలితాలను వీసీ ప్రొ. శ్రీనివాసరావు విడుదల చేశారు. బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బ్యాచిలర్ ఆఫ్ వోకేషనల్ ఐదు సెమిస్టర్ల పరీక్షలకు 1,012 మంది విద్యార్థులు హాజరు కాగా.. 977 పాస్ అయ్యారని తెలిపారు. ఫలితాల కోసం https:www.yvuexams.in ను సంప్రదించాలన్నారు. ఈ ఫలితాలను విడుదల చేసిన వారిలో రిజిస్ట్రార్ పి.పద్మ, పరీక్షల నియంత్రణ అధికారి ప్రొ. కేఎస్వీ కృష్ణారావు ఉన్నారు.