News April 12, 2024
మైలాపూర్: రిజర్వ్ బ్యాంక్ ప్లేస్‌లో చిల్డ్రన్స్ బ్యాంక్

మైలాపూర్ దేవులపల్లి PS పరిధిలో నకిలీ కరెన్సీ ముఠా కేసులో పోలీసులకు ట్విస్ట్ ఎదురైంది. పట్టుబడ్డ దుండగులు నోట్లు అచ్చం మక్కీకి మక్కీ చేశారు. కానీ ఓ దగ్గర పొరపాటు చేశారు. రిజర్వ్ బ్యాంకు బదులు చిల్డ్రన్స్ బ్యాంక్ ముద్ర వేశారు. మల్కాజిగిరిలో డీల్ కుదరక మైలార్ దేవులపల్లికి వచ్చి హోటల్‌లో పోలీసులకు అడ్డంగా బుక్ అయ్యారు. అయితే రిజర్వ్ బ్యాంకు అని ఉంటే గుర్తు పట్టడం కష్టమని పోలీసులు తెలిపారు.
Similar News
News September 11, 2025
జూబ్లీహిల్స్: ఆశల పల్లకిలో ‘హస్తం’ అభ్యర్థులు

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో ప్రధాన పార్టీల నుంచి ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. కాంగ్రెస్ టికెట్ కోసం తీవ్ర పోటీ నెలకొంది. BRS నుంచి మాగంటి సునీతకే టికెట్ ఇస్తారని తెలుస్తోంది. BJP నుంచి లంకల దీపక్ రెడ్డి, ఇతరుల పేర్లను పరిశీలిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. జూబ్లీహిల్స్‌లో గెలిస్తే మంత్రి పదవి ఖాయం అంటూ కొందరు అధికార పార్టీ నేతలు ప్రచారం చేస్తూ ఆశల పల్లకిలో విహరించడం గమనార్హం.
News September 11, 2025
HYD: మీరు వినరు.. వారు వదలరు

గణేశ్ ఉత్సవాల్లో హైదరాబాద్ షీ టీమ్స్ స్పెషల్ ఆపరేషన్ నిర్వహించింది. 1,612 మంది ఆకతాయిలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొంది. పట్టుబడ్డ వారిలో 1,544 మంది పెద్దలు, 68 మంది ఉన్నారు. ఇందులో 168 పెట్టి కేసులు నమోదు చేయగా.. 70 కేసులకు సంబంధించి నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. కొందరికి జరిమానా, ఒకరికి 2 రోజుల సింపుల్ జైలు శిక్ష, 1,444 మందికి వార్నింగ్, కౌన్సెలింగ్ కోసం పిలిచి అవగాహన కల్పించారు.
News September 11, 2025
HYD: నకిలీ వెబ్‌సైట్లను గుర్తించడంపై ముందడుగు..!

HYDలో CipherCop-2025 ప్రారంభమైందని బుధవారం సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ షికాగోయల్ తెలిపారు. ఇది మొదటి జాతీయ హ్యాకథాన్ అన్నారు. వచ్చే 2 రోజుల్లో యువ మేధావులు పోలీస్ టెక్నాలజీ మిషన్ ప్రేరణతో క్రిప్టో లావాదేవీలు గుర్తించడం, నకిలీ వెబ్‌సైట్లు, స్కామ్ యాప్‌లు, మోసపూరిత డిజిటల్ కంటెంట్‌ను వెలికితీయడంపై సవాళ్లు స్వీకరిస్తారని చెప్పారు.