News December 29, 2024
మైసూర్‌లో యాక్సిడెంట్.. మంచిర్యాల యువకుడు మృతి

కర్ణాటకలోని మైసూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మంచిర్యాల యువకుడు మృతి చెందాడు. దొరగారిపల్లెకు చెందిన బల్జిపెల్లి సందీప్ హైదరాబాద్‌లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. కాగా సందీప్ స్నేహితులతో కలిసి శుక్రవారం కారులో మైసూర్ వెళ్లగా శనివారం ఉదయం గుర్తుతెలియని వాహనం ఢీకొంది. దీంతో సందీప్‌తో పాటు మరొకరు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. సందీప్ మృతితో దొరగారిపల్లెలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Similar News
News February 6, 2026
ADB: రాజకీయాల వైపు ‘విద్యావంతుల’ చూపు

ADB మున్సిపల్ బరిలో అధికంగా విద్యావంతులు పోటీలో ఉండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉన్నత విద్యను అభ్యసించిన వారు సైతం ఎన్నికల్లో పోటీకి సై అంటున్నారు. 49 వార్డులకు గాను 314 మంది పోటీలో నిలిచారు. వీరిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ 13, గ్రాడ్యుయేషన్ 45, అండర్ గ్రాడ్యుయేషన్ 127, నిరక్షరాస్యులు 85, వివరాలు ఇవ్వనివారు 44 మంది ఉన్నారు. ఉద్యోగ అవకాశాలు రాకపోవడంతో నిరుద్యోగ యువత రాజకీయాల వైపు ఆసక్తి చూపుతున్నారు.
News February 5, 2026
ADB: అభ్యర్థులు ఖర్చు పెట్టేముందుకు జాగ్రత్త..!

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఖర్చులకు తగ్గ వివరాలను సమర్పించాల్సి ఉంటుందని, వాటి గురించి తెలుసుకోవాలని ఎన్నికల జిల్లా అబ్జర్వర్ హన్మంత్ నాయక్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నిబంధనల గురించి తెలుసుకోవాలని సూచించారు. తమకు ఎన్నికల కమిషన్ విధించిన లక్ష లోపే ఖర్చులు చేయాలన్నారు. ఖర్చులు ఎక్కువైతే గెలిచిన తరువాత కూడా డిస్ క్వాలిఫై అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు.
News February 5, 2026
ADB: రెబల్స్‌గా పోటీ.. ఒకే వేదికపై నలుగురు

మున్సిపల్ ఎన్నికల వేళా ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కంది శ్రీనివాస్ రెడ్డిపై రెబల్స్‌గా పోటీచేసిన నాయకులు సాజిద్ ఖాన్, సుజాత, శ్రీకాంత్ రెడ్డి ఇప్పుడు ఒకే వేదికపై కనిపించడం ఆశ్చర్యానికి గురిచేసింది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం కాంగ్రెస్ అభ్యర్ధి తరఫున వారందరు ఒకే బృందంగా కలిసి ప్రచారం చేశారు.


