News October 30, 2025

మొంథా తుఫాను కంట్రోల్ రూమ్ తనిఖీ చేసిన కలెక్టర్

image

కలెక్టర్ చదలవాడ నాగరాణి బుధవారం భీమవరం కలెక్టరేట్‌లోని “మొంథా తుఫాను” కంట్రోల్ రూమ్‌ను సందర్శించారు. కంట్రోల్ రూమ్‌కి వచ్చిన కాల్స్ వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రజలు, డివిజనల్, మండల కేంద్రాల నుంచి వచ్చిన ఫిర్యాదులను తక్షణమే సంబంధిత శాఖల దృష్టికి తీసుకువెళ్లి, పరిష్కార చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.

Similar News

News October 29, 2025

నరసాపురం: ప్రజలతో కలిసి భోజనం చేసిన కలెక్టర్

image

నరసాపురం మండలంలో పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను బుధవారం కలెక్టర్ నాగరాణి ఆకస్మికంగా సందర్శించారు. తొలుత జిల్లా కలెక్టర్ పీఎం లంకలో డిజిటల్ భవన్‌లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని సందర్శించి,  ఆశ్రయం పొందిన వారిని ఆప్యాయంగా పలకరించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు భోజనాన్ని స్వయంగా వడ్డించి కలెక్టర్ కూడా వారితో పాటు కూర్చుని భోజనాన్ని స్వీకరించారు.

News October 29, 2025

రేపటి నుంచి జిల్లాలో స్కూల్స్ యథాతధం: డీఈవో

image

మొంథా తుఫాను తీరం దాటిన నేపథ్యంలో జిల్లాలో ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొనడంతో రేపటి నుంచి స్కూల్స్ యథాతధంగా పనిచేస్తాయని జిల్లా విద్యాశాఖ అధికారి ఈ.నారాయణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తొలుత ఈనెల 31 వరకు సెలవులు ప్రకటించినప్పటికీ ప్రస్తుతం వాతావరణం నెమ్మదించడంతో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు గురువారం నుంచి యథాతధంగా పనిచేస్తాయని చెప్పారు.

News October 29, 2025

ప.గో. కలెక్టర్‌తో మాట్లాడిన సీఎం చంద్రబాబు

image

మొంథా తుఫాన్ నేపథ్యంలో అప్రమత్తతపై సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారం రాత్రి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణికి ఫోన్ ద్వారా ప్రత్యేకంగా సమీక్షించారు. తుఫాన్ కంట్రోల్ రూములు, పునరావాస కేంద్రాలపై ముఖ్యమంత్రికు జిల్లా కలెక్టర్ వివరించారు. తుఫాన్ ప్రభవాన్ని ఎప్పటికప్పుడు అధికారులు, ప్రజాప్రతినిధులు పరిశీలిస్తూ ఉండాలని సీఎం సూచించారు.