News October 28, 2025
మొంథా తుఫాన్ హెచ్చరికలు ఆందోళనలో రైతాంగం

మొంథా తుఫాన్ ప్రభావ హెచ్చరికలతో రైతాంగం తీవ్ర ఆందోళనలో ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వరి కోతలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. తుఫాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, కొనుగోలు కేంద్రాల వద్ద రైతు కావలసిన ఏర్పాట్లను తక్షణమే చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్లు ఆదేశించారు. 1,32,000 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి ఉంటుందని అంచనా వేయగా ఇప్పటికే 35% వరకు వరి కోతలు పూర్తికావస్తున్నాయి.
Similar News
News October 29, 2025
SRPT: టీచర్‌గా మారి పాఠాలు బోధించిన కలెక్టర్

ఉపాధ్యాయుడిగా మారి విద్యార్థులకు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పాఠాలు బోధించారు. మంగళవారం జాజిరెడ్డిగూడెం మండలం రామన్నగూడెం ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. 4, 5వ తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు. వారితో ఇంగ్లిష్ చదివించి తెలుగులో అర్ధాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల ప్రతిభకు కలెక్టర్ ఫిదా అయ్యారు.
News October 29, 2025
HNK: ధాన్యం కొనుగోళ్లలో సమస్యల పరిష్కారానికి కంట్రోల్ రూమ్

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. ధాన్యం కొనుగోలులో ఎదురయ్యే సమస్యల పై ఫిర్యాదుల స్వీకరణకు కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను కలెక్టర్ మంగళవారం ప్రారంభించారు. రైతులు ధాన్యం కొనుగోలు సమస్యల పరిష్కారానికి 7330751364ను సంప్రదించాలని కలెక్టర్ సూచించారు.
News October 29, 2025
పెద్దపల్లి ప్రయాణికులకు RTC గుడ్ న్యూస్

కార్తీక మాసాన్ని పురస్కరించుకొని NOVలో ప్రయాణికుల కోసం GDK డిపో ప్రత్యేక యాత్ర ప్యాకేజీలను ప్రకటించింది. ఈ యాత్రల ద్వారా వివిధ పుణ్యక్షేత్రాలకు వెళ్లే సౌకర్యాన్ని కల్పించింది. NOV 4న యాదాద్రి, 6న శ్రీశైలం, 11న రామేశ్వరం(7 DAY’S), 18న శ్రీశైలం, 23న కాశీ, అయోధ్యకు స్పెషల్ సూపర్ లగ్జరీ, రాజధాని బస్సులను ఏర్పాటు చేశామని DM నాగభూషణం తెలిపారు. మరిన్ని వివరాలకు 7013504982 నంబరును సంప్రదించాలన్నారు.


