News January 2, 2026
మొక్కజొన్నలో కత్తెర పురుగు నివారణకు సూచనలు (1/2)

మొక్కజొన్న విత్తిన వెంటనే ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలను అమర్చి కత్తెర పురుగు ఉనికిని గమనించాలి. మొక్కలపై వాటి గుడ్లను గమనిస్తే వేపమందును పిచికారీ చేయాలి. లేత మొక్కజొన్న పంటల్లో 30 రోజుల వరకు ఎకరాకు 15 పక్షి స్థావరాలను, 15 లింగాకర్షక బుట్టలను పైరులో ఏర్పాటు చేసుకోవాలి. ఎకరాకు 9 కిలోల పొడి ఇసుక, కిలో సున్నాన్ని కలిపి మొక్కజొన్న సుడులలో వేస్తే ఇసుక రాపిడికి కత్తెర పురుగు లార్వాలు చనిపోతాయి.
Similar News
News February 13, 2026
జింబాబ్వే చేతిలో ఆస్ట్రేలియాకు షాక్ తప్పదా?

T20WCలో పసికూన జింబాబ్వే ఆస్ట్రేలియాకు షాక్ ఇచ్చేలా ఉంది. 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కంగారూలు 5 ఓవర్లలో 34 రన్స్‌కే 4 వికెట్లు కోల్పోయారు. ఇంగ్లిస్, హెడ్, గ్రీన్, టిమ్ డేవిడ్ తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. క్రీజులో మ్యాక్స్‌వెల్, రెన్షా ఉన్నారు. ఆసీస్ విజయానికి 90 బంతుల్లో 136 రన్స్ అవసరం. మరి ఈ మ్యాచులో ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.
News February 13, 2026
PHOTO: మనవడు, మనుమరాళ్లతో చిరు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతుల కవలల బారసాల వేడుక ఫొటోను మెగాస్టార్ చిరంజీవి షేర్ చేశారు. వీరికి శివరామ్, అన్వీరా దేవిగా నామకరణం చేసినట్లు తెలిపారు. తన పేరు (శివ శంకర వరప్రసాద్), రామ్ చరణ్ పేర్ల కలయికతో ‘శివరామ్’ అని, కనకదుర్గమ్మ ఆశీస్సులతో భయం లేని తత్వాన్ని, దైవిక రక్షణను సూచించేలా అన్వీరా దేవి పేరు పెట్టినట్లు పేర్కొన్నారు. ఈ చిన్నారులపై అందరి దీవెనలు ఉండాలని కోరారు.
News February 13, 2026
BRS MLA కౌశిక్ రెడ్డికి షాక్

TG: హుజూరాబాద్ BRS MLA పాడి కౌశిక్ రెడ్డికి షాక్ తగిలింది. హుజూరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో 30 వార్డులకు 16 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. బీఆర్ఎస్ 8, బీజేపీ 5 స్థానాలకే పరిమితమైంది. మ్యాజిక్ ఫిగర్ సాధించిన కాంగ్రెస్ ఛైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోనుంది.


