News October 29, 2025

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి: అదనపు కలెక్టర్

image

జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కీమ్యా నాయక్ అధికారులను ఆదేశించారు. మొక్కజొన్న పండించిన రైతులు దళారులకు తక్కువ ధరకు కాకుండా ప్రభుత్వ మద్దతు ధరకు అమ్ముకోవాలన్నారు. జిల్లాలో 10,958 ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశారని, ఇప్పటికే మొక్కజొన్న హార్వెస్టింగ్ ప్రారంభమైందన్నారు. కాబట్టి రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలన్నారు.

Similar News

News October 30, 2025

ప్రకాశం: UG పరీక్షలు వాయిదా

image

మొంథా తుఫాన్ కారణంగా ఆంధ్ర కేసరి యూనివర్సిటీ పరిధిలోని అక్టోబర్ 31 నుంచి నవంబర్ 7 వరకు జరగాల్సిన గ్రాడ్యుయేట్ (UG) 3, 5వ సెమిస్టర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. వీటిని తిరిగి నవంబర్ 10 నుంచి 17 వరకు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ప్రొ. డీవీఆర్ మూర్తి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

News October 30, 2025

అనకాపల్లి: నేడు కూడా కొనసాగనున్న పునరావాస కేంద్రాలు

image

మొంథా తుఫాన్ తీరం దాటినా పునరావాస కేంద్రాలు గురువారం కూడా కొనసాగుతాయని కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. జిల్లాలో 78 పునరావాస కేంద్రాల్లో 3,993 మంది ఆశ్రయం పొందుతున్నారు. కేంద్రాల్లో వీరికి భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారు. పునరావాస కేంద్రాలకు మండల స్థాయి అధికారులు ఇన్‌ఛార్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు.

News October 30, 2025

ప్రభుత్వ స్కూళ్లలో కార్పొరేట్ సౌకర్యాలు.. తొలుత కొడంగల్‌లో

image

TG: ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా వసతులు కల్పించేందుకు సర్కార్ కసరత్తు చేస్తోంది. ఇందుకోసం అసెంబ్లీ నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకోనుంది. తొలుత ప్రయోగాత్మకంగా కొడంగల్‌లో చేపట్టనున్నారు. స్కూళ్లలో కంప్యూటర్ ల్యాబ్‌లు, ఇంటర్నెట్, లైబ్రరీలు, క్రీడా మైదానాలు వంటివి ఏర్పాటు చేస్తారు. టీచర్లు, స్టూడెంట్స్‌కు ID కార్డులు, 8-10th స్టూడెంట్స్‌కు IIT, NEET ఫౌండేషన్ మెటీరియల్ అందిస్తారు.