News February 13, 2025
మొగడంపల్లి: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739366818104_50452848-normal-WIFI.webp)
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని మొగడంపల్లి మండలం చిరాగ్‌పల్లి SI రాజేందర్ రెడ్డి పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. పక్కా సమాచారం మేరకు హైదరాబాద్ నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్న 115 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని ఆర్టీఏ చెకోపోస్టు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా పట్టుకొని స్వాధీనం చేసుకున్నామన్నారు. శివానంద్, వెంకట్, పాండు, ఓనర్ సిద్ధు, డ్రైవర్ సంగమేష్‌లపై కేసు నమోదు చేశామన్నారు.
Similar News
News February 13, 2025
వైసీపీ ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్‌గా కురసాల
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739400308936_19090094-normal-WIFI.webp)
వైసీపీ ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్‌గా కాకినాడకు చెందిన మాజీ మంత్రి కురసాల కన్నబాబు నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ విజయ్ సాయి రెడ్డి రాజీనామా చేయడంతో ఇప్పటివరకు ఆ పదవి ఖాళీగా ఉంది.
News February 13, 2025
తూ.గో: నాటుకోళ్లకు బర్డ్ ఫ్లూ వైరస్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739413566235_1128-normal-WIFI.webp)
బర్డ్ ఫ్లూ అందరినీ భయాందోళనకు గురిచేస్తోంది. కోళ్ల రైతులు, పెంపకందారులు బెంబేలెత్తిపోతున్నారు. బర్డ్ ఫ్లూ నాటుకోళ్లపై కూడా తాజాగా ప్రభావం చూపుతోంది. బర్డ్ ఫ్లూ వైరస్ కారణంగా కానూరు అగ్రహారంలో కోళ్ల ఫారాల్లో కోళ్లన్నీ చనిపోయాయి. వైరస్ కానూర్ అగ్రహారంలో నాటుకోళ్లకూ సోకింది. అక్కడ వ్యాధి సోకిన నాటుకోళ్లను పూడ్చివేశారు. దాదాపు 500 నాటుకోళ్లు చనిపోయాయి.
News February 13, 2025
గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి.. నేడు నిందితుల బెయిల్‌పై తీర్పు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739413706066_934-normal-WIFI.webp)
టీడీపీ గన్నవరం నియోజకవర్గ కార్యాలయంపై దాడి కేసులో నిందితుల బెయిల్‌పై ఇవాళ తీర్పు వెలువడనుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని తాజాగా అరెస్ట్ చేశారు. కేసులో 88 మందిని నిందితులుగా చేర్చగా ఇప్పటికే 45మందిని అరెస్ట్ చేశారు. కాగా ఫిర్యాదుదారుడు సత్యవర్దన్ తనకు ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేదని, భయపెట్టి ఫిర్యాదు చేయించారని సోమవారం న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇచ్చిన సంగతి తెలిసిందే.