News January 16, 2025

మొగల్తూరులో కొత్త అల్లుడికి 200 రకాల పిండి వంటలతో విందు

image

మొగల్తూరులో బుధవారం సంక్రాంతి సందర్భంగా కొత్త అల్లుడికి 200 రకాల పిండి వంటలతో విందు ఏర్పాటు చేశారు. మొగల్తూరుకి చెందిన విష్ణు ప్రియ, గుంటూరుకు చెందిన త్రిపురమల్లు వైష్ణవ్‌లకు గత ఏడాది ఫిబ్రవరిలో వివాహమైంది. తొలి పండుగకు అల్లుడితో పాటు కుటుంబ సభ్యులను విష్ణు ప్రియ తల్లిదండ్రులు ఫణి, ఝాన్సీలు ఆహ్వానించారు.  వైష్ణవ్‌కు 200 రకాల పిండివంటలతో విందు ఏర్పాటు చేసి మర్యాద చేశారు.

Similar News

News January 29, 2026

నేడే కోపల్లె వంతెన నిర్మాణ పనులు ప్రారంభం: కలెక్టర్

image

కాళ్ల (M) కోపల్లె బ్రిడ్జికి సంబంధించిన పనులను గురువారం నుంచి ప్రారంభిస్తున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. పాత బ్రిడ్జిని తొలగించి తాత్కాలికంగా డైవర్షన్ రోడ్డు నిర్మాణం చేపట్టడం జరుగుతుందని అన్నారు.ఈ రోడ్డులో లైట్ వెహికల్స్‌కు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. హెవీ వెహికల్స్ నేషనల్ హైవే మీదుగానే వెళ్లాలని సూచించారు. ఇటీవల మంత్రులు ఈ రోడ్డుకు శంకుస్థాపన చేశారన్నారు.

News January 29, 2026

ఆక్వా సాగు రిజిస్ట్రేషన్లు వేగవంతం చేయాలి: కలెక్టర్‌

image

జిల్లాలో ఆక్వా సాగు రిజిస్ట్రేషన్లను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. బుధవారం నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. జిల్లాలోని 1.31 లక్షల ఎకరాల ఆక్వా విస్తీర్ణంలో ఇప్పటివరకు 66,340 ఎకరాల నమోదు పూర్తయిందని తెలిపారు. మిగిలిన 39,413 ఎకరాల అప్సడా రిజిస్ట్రేషన్ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని స్పష్టం చేశారు.